Prabhas Health: ప్రభాస్ జాతకం కన్నతల్లికి తప్ప ఎవరికీ తెలియదు.. వేణు స్వామి వ్యాఖ్యలపై పెద్దమ్మ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Syamala Devi felt bad about Venu Swami Comments on Prabhas Health: ప్రభాస్ జాతకం గురించి ఆయన ఆరోగ్యం గురించి వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి అనేకసార్లు అనేక ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఇక హిట్ అనేది దక్కదు అని అనేక ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టిన తర్వాత సలార్ సినిమా హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని సైతం టార్గెట్ చేశారు. అయితే ఆ సంగతి అలా ఉంచితే తాజాగా కృష్ణంరాజు భార్య ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి జ్యోతిష్యుడు వేణు స్వామి వ్యాఖ్యల మీద స్పందించారు. తాను పెద్దగా సోషల్ మీడియా ఫాలో అవ్వను కానీ ప్రభాస్ జాతకం గురించి ఇలా చెబుతున్నారని తెలిసిన వాళ్ళు నాకు ఆ వీడియోలు చూపించారు. ఆ వీడియోలు చూసిన తర్వాత నాకు చాలా బాధనిపించింది. ఎందుకంటే ప్రభాస్ జాతకం ఏమిటి? అనే విషయం ప్రభాస్ కన్నతల్లికి తప్ప మాకు కూడా తెలియదు.
Rishab Shetty: ‘హనుమాన్’లో ఆ పాత్ర రిషబ్ శెట్టి మిస్సయ్యాడు.. చేసి ఉంటేనా, అరాచకం అంతే!!
Also Read
అలాంటి ప్రభాస్ జాతకం గురించి ఆ జ్యోతిష్యుడికి ఎలా తెలిసింది? ఆయన చెప్పేవన్నీ పుకార్లు తప్ప అందులో ఎలాంటి నిజాలు లేవు. ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానుల సైతం నా దృష్టికి తీసుకువచ్చారు. అమ్మ, మీరు ఈ విషయంలో ఖండించాలి లేకపోతే ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి అంటే ఇందులో నేను ఖండించేదేముంది పుకారు అని మీరే చెబుతున్నారు కదా అని తోసిపుచ్చాను, అని ఆమె అన్నారు. నిజానికి ప్రభాస్ జాతకం ఎలాంటిది? ఆయన పుట్టిన ఘడియలు ఏమిటి అనే విషయం తనకు కూడా తెలియవని, అవన్నీ ప్రభాస్ కన్న తల్లికి మాత్రమే తెలుసని ఈ సందర్భంగా శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా శ్యామలాదేవి, ప్రసీద, ప్రభాస్ తదితరులు కృష్ణంరాజు సొంత గ్రామం అయిన మొగల్తూరులో ఒక మెగా షుగర్ క్యాంపు నిర్వహించారు. అయితే ప్రభాస్ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా శ్యామలాదేవి, ప్రసీద మాత్రం అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!