Surya Teja Aelay: టాలీవుడ్లో మరో వారసుడు ఎంట్రీ.. హీరోగా స్టార్ డిజైనర్ కొడుకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surya Teja Aelay Bharathanatyam First Look Revealed: టాలీవుడ్ లో సినీ రంగానికి చెందిన వారి వారసుల ఎంట్రీ కామన్ గా జరిగేదే. ఇప్పుడు పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను ‘దొరసాని’ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కెవిఆర్ మహేంద్ర దారిరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సూర్య తేజ హీరోగా నటించడమే కాకుండా, దర్శకుడు కెవిఆర్ మహేంద్రతో కలిసి కథ, స్క్రీన్‌ప్లే & డైలాగ్స్ కూడా రాశారు. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి గోస్వామి హీరోయిన్. మేకర్స్ ఈరోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేసారు. ఈ సినిమాకి ‘భరతనాట్యం’ అనే క్లాసిక్ టైటిల్‌ని లాక్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ ‘భరతనాట్యం’ సినిమాకి ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ అనే క్యాప్షన్ పెట్టడం గమనార్హం.
Suhas Cable Reddy: నవ్వులతో గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు ఈ కేబుల్ రెడ్డి
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
ఇక ఈ సినిమా టైటిల్‌పై బ్లడ్ మార్క్స్ కనిపిస్తుండగా సూర్య తేజ షేడ్స్‌తో ట్రెండీ, స్టైలిష్‌గా ఉండగా అతనికి పూలతీగ చుట్టుకోవడం ఆసక్తికరంగా ఉంది. ఇక వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ కూడా పోస్టర్ లో కనిపించారు. చాలా మంది ప్రముఖ హాస్యనటులు నటిస్తున్న ఈ సినిమా హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ట్యాగ్‌లైన్ సూచించినట్లుగా భరతనాట్యానికి సినిమా కనెక్షన్ ఉన్నట్టు కనిపిస్తూ ఉండగా పోస్టర్‌లోని తుపాకీ సినిమా క్రైమ్ సైడ్‌ను సూచిస్తోంది. ఈ సినిమాకు ‘భరతనాట్యం’ అనే క్లాసిక్ టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే టీజర్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు మేకర్స్. ‘భరతనాట్యం’ షూటింగ్ మొత్తం పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!