Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, దర్శకుడు ‘RJ బాలాజి’ డైరెక్షన్ లో రూపొందించిన పాన్-ఇండియా చిత్రం ‘కరుప్పు‘. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్లలో సందడి చేస్తోంది. వాస్తవానికి ఈ సినిమా నిన్న (గురువారం) విడుదల కావాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఎదురైన కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఫైనాన్స్ క్లియరెన్స్ విషయంలో తలెత్తిన సాంకేతిక ఇబ్బందుల వల్ల గురువారం నాటి షోలు నిలిచిపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు.
సినిమా విడుదలకు ముందు ఎదురైన ఫైనాన్షియల్ అడ్డంకులను చిత్ర యూనిట్ ఎట్టకేలకు పరిష్కరించింది. అన్ని క్లియరెన్స్ పత్రాలు రావడంతో ఈ రోజు ఉదయం నుంచే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో షోస్ స్టార్ట్ అయ్యాయి. తమిళనాడు వ్యాప్తంగా ఫ్యాన్స్ సంబరాలు ఓ రేంజ్ లో చేస్తున్నారు. పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ఓవర్సీస్లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదలైంది. వరుస ఫ్లోప్స్ తో సతమతమవుతున్న సూర్య కరుప్పుతో సాలిడ్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. కరుప్పు రిలీజ్ నేపథ్యంలో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. సూర్య, త్రిష జంటగా నటించిన ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. వాయిదాల పర్వం తర్వాత భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
-
Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్‌లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!