సెలెబ్రిటీల పేర్లతో చీటింగ్ జరగడం చూస్తుంటే ఉంటాము. అయితే ఈసారి మాత్రం కేటుగాళ్లు రూటు మార్చి ఏకంగా స్టార్ హీరో నిర్మాణ సంస్థనే వాడుకున్నారు. సౌత్ ఫిల్మ్ స్టార్ సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పేరును మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ వారి సోషల్ మీడియా ఖాతాలో తమ నిర్మాణ సంస్థ పేరుతో జరిగిన మోసం గురించి షాకింగ్ వార్తను పంచుకుంది. ఒక మోసగాడు వారి లోగోతో పాటు నకిలీ ఇమెయిల్ ఐడిని సృష్టించాడు. కాస్టింగ్ కాల్స్ ప్రకటించాడు. అనంతరం డబ్బులు చెల్లించాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ విషయం ప్రొడక్షన్ హౌస్ దృష్టికి రావడంతో వారు వెంటనే స్పందించి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.
Read Also : క్షమాపణలు కోరిన సామ్… వారిని ప్రసన్నం చేసుకునే పని..!
“కొంతమంది మోసగాళ్లు మా లోగోతో పాటు 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పేరును ఉపయోగించి నకిలీ ఇమెయిల్ ఐడిని (2dentertainment.gokul@gmail.com) సృష్టించారని, ఆడిషన్స్ కోసం ఆహ్వానించడం, డబ్బులు చెల్లించామని కోరినట్టు మాకు తెలిసింది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పేరు, లోగోను దుర్వినియోగం, పలువురిని మా సంస్థ పేరుతో మోసం చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశాము. ఆడిషన్‌ల కోసం ఇమెయిల్‌లు, ఆఫర్లు వంటివి నిజమో కాదో ముందుగా తెలుసుకోవాలని, సాధారణ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని కోరారు. మరోవైపు 2డి ఎంటర్‌టైన్‌మెంట్ అమెజాన్ ప్రైమ్‌తో జై భీమ్, ఉదన్‌పిరప్పే, ఓ మై డాగ్, మరియు రామ్ ఆండలం రావణే ఆండలంతో సహా నాలుగు చిత్రాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిని సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ సినిమాలు ఈ ఏడాది అమెజాన్‌లో ప్రసారం కానున్నాయి.
