Suriya: సెట్ లో ప్రమాదం.. తన ఆరోగ్య పరిస్థితి చెప్పిన సూర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దిశా పటానీ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నెలో జరుగుతుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా సూర్యకు పెద్ద ప్రమాదం తప్పింది. భారీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొన్న సూర్యపై రోప్ కెమెరా వచ్చి పడింది.. వెంటనే సూర్య పక్కకు తప్పుకోగా.. కెమెరా భుజానికి తగిలింది. ఇక షూటింగ్ ను ఆపేసి.. చిత్ర బృందం వెంటనే సూర్యను హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. ఈ వార్త విన్న సూర్య అభిమానులు ఉదయం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్య అన్నా ఎలా ఉన్నావ్.. అన్నా.. ఆరోగ్యం ఎలాఉంది.. ? అంటూ కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. ఇక ఎట్టకేలకు సూర్య.. అభిమానుల ఆందోళన తగ్గించాడు. తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తూ ట్వీట్ చేశాడు.
Game Changer: అరేయ్.. ఆ లీకులు ఆపండ్రా.. సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
“ప్రియమైన మిత్రులారా, శ్రేయోభిలాషులు మరియు నా ఫ్యాన్స్ .. మీరు నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ నేను త్వరగా కోలుకోవాలని పెడుతున్న సందేశాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నా ఆరోగ్యం కొంచెం స్థిమితంగా ఉంది.. మీ అందరి ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ట్వీట్ పై అభిమానులు.. త్వరగా కోలకోవాలని కోరుకుంటున్నాం అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Dear Friends, well wishers & my #AnbaanaFans
Heartfelt thanks for the outpouring ‘get well soon’ msgs.. feeling much better.. always grateful for all your love 🙂— Suriya Sivakumar (@Suriya_offl) November 23, 2023
తాజావార్తలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు