NTV Telugu Site icon

Suriya: సెట్ లో ప్రమాదం.. తన ఆరోగ్య పరిస్థితి చెప్పిన సూర్య..

Suriya

Suriya

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దిశా పటానీ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నెలో జరుగుతుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా సూర్యకు పెద్ద ప్రమాదం తప్పింది. భారీ యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొన్న సూర్యపై రోప్‌ కెమెరా వచ్చి పడింది.. వెంటనే సూర్య పక్కకు తప్పుకోగా.. కెమెరా భుజానికి తగిలింది. ఇక షూటింగ్ ను ఆపేసి.. చిత్ర బృందం వెంటనే సూర్యను హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. ఈ వార్త విన్న సూర్య అభిమానులు ఉదయం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్య అన్నా ఎలా ఉన్నావ్.. అన్నా.. ఆరోగ్యం ఎలాఉంది.. ? అంటూ కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. ఇక ఎట్టకేలకు సూర్య.. అభిమానుల ఆందోళన తగ్గించాడు. తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తూ ట్వీట్ చేశాడు.

Game Changer: అరేయ్.. ఆ లీకులు ఆపండ్రా.. సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది

“ప్రియమైన మిత్రులారా, శ్రేయోభిలాషులు మరియు నా ఫ్యాన్స్ .. మీరు నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ నేను త్వరగా కోలుకోవాలని పెడుతున్న సందేశాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నా ఆరోగ్యం కొంచెం స్థిమితంగా ఉంది.. మీ అందరి ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ట్వీట్ పై అభిమానులు.. త్వరగా కోలకోవాలని కోరుకుంటున్నాం అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments