Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scene: కోలీవుడ్ స్టార్ సూర్య నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఆవేశం’ సినిమాతో మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు జితు మాధవన్‌తో సూర్య తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. సూర్య కెరీర్లో 47వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘సీన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్ బజ్ ను పెంచుతోంది. ఇందులో సూర్య ఏకంగా ఓ వింత పోలీస్ ఆఫీసర్‌గా కనిపించడం, ఆయన క్యారెక్టర్ డిజైన్ చాలా డిఫరెంట్‌గా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘సీన్’ టైటిల్ గ్లింప్స్‌లో సూర్య డీఎస్పీ ప్రేమ్‌రాజ్ అనే పోలీస్ అధికారిగా పరిచయమయ్యారు. అయితే ఇది సాధారణ పోలీస్ పాత్ర కాదని గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది. అతని అలవాట్లు, మాట్లాడే విధానం, ప్రవర్తన అన్నీ చాలా విచిత్రంగా చూపించారు. అతని క్యారెక్టర్ గురించి వాయిస్ ఓవర్ ద్వారా చెప్పిన విధానం కూడా సినిమాకు ప్రత్యేకమైన మూడ్‌ను సెట్ చేసింది.
అయితే ఆ తర్వాత వచ్చే సూర్య అసలు ఇంట్రడక్షన్ మాత్రం గ్లింప్స్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఓ కానిస్టేబుల్ భుజంపై చేయి వేసి అతని పక్కనే నడుస్తూ సూర్య స్టైలిష్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత సూర్య తన ట్రేడ్‌మార్క్ స్టైల్లో ఇచ్చే వార్నింగ్‌తో గ్లింప్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. సూర్య ఈ పాత్రలో తన హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో మరోసారి ఆకట్టుకుంటున్నట్లు గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. సాధారణంగా సీరియస్ పోలీస్ క్యారెక్టర్లను చూసే ప్రేక్షకులకు డీఎస్పీ ప్రేమ్‌రాజ్ మాత్రం పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో జితు మాధవన్ తన మార్క్ డిఫరెంట్ ట్రీట్మెంట్ను సూర్య క్యారెక్టర్లో కూడా చూపించినట్లు అనిపిస్తోంది. దీంతో ఈ సినిమా యాక్షన్‌తో పాటు కామెడీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
ఇందులో సూర్య సరసన నజ్రియా కథానాయికగా నటిస్తున్నారు. నస్లెన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఆవేశం’ తర్వాత జితు మాధవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మలయాళ ప్రేక్షకుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌పై బజ్ క్రియేట్ అవుతోంది. సూర్య, జితు మాధవన్ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అభిమానుల్లో పెరుగుతోంది. ఇక టెక్నికల్‌గా కూడా ‘సీన్’ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. వినీత్ అగస్టిన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సుషిన్ శ్యామ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ అందిస్తున్నారు. గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్, కామెడీ సన్నివేశాలకు మంచి ఎనర్జీని తీసుకొచ్చాయి. జ్యోతిక, సూర్యలకు చెందిన ఝగారం స్టూడియోస్, 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూర్య నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సీన్’ (Scene ) చిత్రం థియేట్రికల్ విడుదలకు ఇంకా 50 రోజులు మాత్రమే మిగిలి ఉందంటూ (50 Days To Go) నిన్న మేకర్స్ ఒక సరికొత్త రిమైండర్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఇక ‘సీన్’ సినిమాను దీపావళి కానుకగా 2026 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సూర్య మాస్ ఇమేజ్‌కు జితు మాధవన్ స్టైల్ కలిస్తే ఎలాంటి యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తో సూర్య వరుస బ్లాక్‌బస్టర్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మైథలాజికల్ టచ్‌తో వచ్చిన ‘కరుప్పు’ (Karuppu) ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూర్య కెరీర్లోనే ఆల్‌టైమ్ హైెస్ట్ గ్రాసర్‌గా సరికొత్త రికార్డు సృష్టించగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు జితు మాధవన్ తో దీపావళి బరిలో హ్యాట్రిక్ హిట్ కు సిద్దమవుతున్నారు సూర్య.
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి