కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద ‘కరుప్పు’ చిత్రంతో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. థియేటర్లలో రికార్డుల వేట సాగిస్తూ రూ. 320 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా సక్సెస్ జోష్‌ను చిత్ర యూనిట్ ఘనంగా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే, సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించిన టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు కి హీరో సూర్య ఒక అదిరిపోయే ఖరీదైన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. కరుప్పు విజువల్స్‌కు ప్రేక్షకుల నుండి వచ్చిన ప్రశంసలకు ఫిదా అయిన సూర్య.. జికె విష్ణుకు సరికొత్త ‘మహీంద్రా BE6 బ్యాట్‌మాన్ ఎడిషన్’ కారును కానుకగా అందించారు.
ఈ అద్భుతమైన గిఫ్ట్ అందుకున్న సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కారుతో దిగిన ఫోటోను ఎక్స్ లో షేర్ చేస్తూ.. “జస్ట్ గాడ్ థింగ్స్!! థాంక్యూ సూర్య సర్. మీకు చాలా పెద్ద మనసు ఉంది” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘కరుప్పు’ చిత్రం సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య-త్రిష కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ. 320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా ఇండియాలోనే రూ. 200 కోట్ల మార్కును అందుకుంది. అంతేకాకుండా, తమిళనాడులో రూ. 150 కోట్ల క్లబ్‌లో చేరింది. సూర్య కెరీర్‌లోనే రూ. 150 కోట్ల తమిళనాడు గ్రాస్ సాధించిన మొట్టమొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో జికె విష్ణు అందించిన విజువల్స్ మరియు కెమెరా వర్క్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు నుండి ప్రశంసలు వచ్చాయి.
Just God things!!
Thank you @Suriya_offl sir.
You have a huge heart!!!! #Karuppu pic.twitter.com/N8CtzgHRjr— GK Vishnu (@dop_gkvishnu) May 31, 2026
