Site icon NTV Telugu

Manchu Vishnu: సన్నీలియోన్ తో ‘మా’ ప్రెసిడెంట్ రొమాన్స్.. ఇదిగో సాక్ష్యం

vishnu

vishnu

మంచు విష్ణు.. మోసగాళ్లు సినిమా తరువాత మరో సినిమా చేసింది లేదు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసిన సంగతి తెల్సిందే. ఆ తరువాత విష్ణు మా రాజకీయాల్లోకి దిగడం, ప్రెసిడెంట్ కావడం, మధ్యలో కరోనా దెబ్బ వెరసి కొన్ని రోజులు విష్ణు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముద్నుకు రానునంట్లు ఇటీవల ప్రకటించాడు. నూతన దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో విష్ణు ఒక సినిమాలో నటింస్తున్నాడు. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు గా విష్ణు కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ ని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా మంచు విష్ణు విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే ఈ చిత్రంలో విష్ణు సరసాం హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నదని వార్తలు గుప్పుమనడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇఇక తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో శృంగార తార సన్నీ లియోన్ నటించనుంది. రేణుక అనే పాత్రలో ఆమె నటిస్తున్నదని మేకర్స్ అధికారికంగా తెలిపారు. సన్నీ కి మంచు ఫ్యామిలీకి మధ్య స్నేహ బంధం ఉందన్న విషయం తెలిసిందే. కరెంట్ తీగ సినిమాలో మంచు మనోజ్ కోసం ఆమె ఒక సాంగ్ లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు విష్ణు కోసం అమ్మడు రంగంలోకి దిగుతుంది. మరి పాత్రల పరిచయంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version