Sunny Leone Doctor Yogi on Sets: అకీరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపై యోగేష్, ఆకృతి అగర్వాల్, హీరో హీరోయిన్ గా సన్నీ లియోన్ మరో ప్రధాన పాత్రలో ‘ డాక్టర్ యోగి డైరీస్ ‘ తెరకెక్కుతోంది. తాజాగా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఈ సిసినిమా పూజా కార్యక్రమం జరిగింది. పారానార్మల్ థ్రిల్లర్ గా సరికొత్త కథ,కథనాలతో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి ఈ సినిమాను నిర్మిస్తుండగా రాజేష్ – ప్రసాద్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి దర్శకులు వీర శంకర్, చంద్ర మహేష్, వి.ఎన్. ఆదిత్య, గవిరెడ్డి శ్రీనివాస్,సూర్యతేజ, గీతా ఆర్ట్స్ అనీష్, వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. దర్శకుడు వీరశంకర్ క్లాప్ కొట్టగా, వి.ఎన్.ఆదిత్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు, చంద్ర మహేష్ గౌరవ దర్శకత్వం వహించారు. నటుడు ఆదిత్య శ్రీ వాస్తవ మాట్లాడుతూ తెలుగు లో ఇది నా తొలి సినిమా.. గతంలో తెలుగు నుండి కొన్ని ఆఫర్స్ వచ్చినా కొన్ని కథ నచ్చకో, డేట్స్ అడ్జెస్ట్ కాక చెయ్యలేకపోయాను.
Tantra Trailer: భయపెడుతున్న తంత్ర ట్రైలర్.. వామ్మో.. ప్యాంట్ తడిచిపోయేలా ఉంది కదరా
ఇప్పుడు కథ, డేట్స్ రెండు కుదరటం తో డాక్టర్ యోగి డైరీస్ తో మీ ముందుకు వస్తున్నా, ఇందులో హీరో గా చేస్తున్న యోగేష్ ఖచ్చితంగా పెద్ద హీరో ల లిస్ట్ లో చేరతాడు.హీరో యోగేష్ మాట్లాడుతూ ఇది నా మొదటి సినిమా ఇందులో నేను, సన్నీ లియోన్ డిటెక్టివ్ లు గా చేస్తున్నాం, డైరెక్టర్స్ రాజేష్ – ప్రసాద్ గార్లు కథ చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ కాకుండా కాస్టింగ్, టెక్నీషియన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, ముట్టా రాజేందర్, ఆదిత్య శ్రీ వాస్తవ, నాజర్ , ప్రవీణ్ లాంటి పెద్ద నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని 2024 లో ప్రేక్షకులకు ఒక మంచి పరానార్మల్ థ్రిల్లర్ తో అలరిస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలనని అన్నారు.