Sunny Leone: సన్నీ లియోన్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. డబ్బు కోసం ఒకప్పుడు పోర్న్ స్టార్ గా నటించింది అన్న మాటే కానీ ఆమె వ్యక్తిత్వం ఎంతో గొప్పది. చిన్నారులను దత్తత తీసుకొని పెంచడమే కాకుండా భారత సంస్కృతి సాంప్రదాయాలను నిత్యం గౌరవిస్తూనే ఉంటుంది. తాజాగా నేడు రక్షా బంధన్ కావడంతో సన్నీ ఇంట్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. తన భర్త, పిల్లలతో ఆమె రాఖీని సెలబ్రేట్ చేసుకుంది. సన్నీ, అతని తమ్ముడుకు రాఖీ కట్టగా, సన్నీ కవల పిల్లలకు ఆమె దత్త కూతురు నిషా రాఖీ కట్టింది. ఈ ఫోటోలను సన్నీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ట్రెడిషనల్ బట్టల్లో చిన్నారులు ఎంతో ముద్దుగా ఉన్నారు. ఇక సన్నీ సైతం సాంప్రదాయమైన దుస్తుల్లో కనిపించి మెప్పించింది.
విదేశాల్లో పుట్టి పెరిగినా తెలుగు పండగలు, ఆనవాయితీలను ఎంతో చక్కగా పాటిస్తున్న సన్నీని నెటిజన్లు అందరూ పొగిడేస్తున్నారు. ఇండియా లో పుట్టి కూడా పండగలను గౌరవించనివారిని చూసి నేర్చుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సన్నీ లియోన్ తెలుగులో జిన్నా సినిమాలో నటిస్తోంది. మొదటిసారి మంచు విష్ణు సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ సెట్ లో విష్ణు, సన్నీ చేసిన అల్లరి వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఈ హాట్ బ్యూటీకి ఎలాంటి విజయాన్ని అందివ్వనున్నదో చూడాలి.