Sunitha Boya: మరోసారి సునీత బోయ మీడియా ముందు రచ్చ చేసింది. నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడంటూ రోడ్డెక్కింది. గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు నగ్నంగా బైఠాయించింది. ఎన్నోరోజుల నుంచి ఆమె బన్నీవాసుతో పోరాడుతోంది. సునీత బోయ ఒక జూనియర్ ఆర్టిస్టుగా తెలుగు తెరకు పరిచయమైంది. బన్నీవాసు తనకు క్యారెక్టర్ ఇప్పిస్తానని తనను వాడుకొని వదిలేశాడని కేసు పెట్టిన ఆమె ఇంకా ఆటను తనను వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఈ కేసులో కోర్టు బన్నీవాసుకు సపోర్ట్ ఇచ్చింది. హైకోర్టు సైతం సాక్ష్యాలు లేనికారణంగా కేసును కొట్టివేస్తునట్లు తెలిపింది.
ఇక అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న సునీతా ఇప్పుడు మరోసారి రోడ్డెక్కింది. బన్నీ వాసు తనను మోసం చేశాడని, ఇప్పటికి తనను పోలీసులతో వేధిస్తున్నాడని, నాలుగు సార్లు చంపడానికి కూడా ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది. గీతా ఆర్ట్స్ ముందు నగ్నంగా బైఠాయించిన ఆమె బన్నీవాసుకు శిక్ష పడేవరకు తాను అక్కడి నుంచి కదిలేది లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నగ్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ఘటనపై బన్నీవాసు ఎలా స్పందిస్తాడో చూడాలి.