Sunil : భయంకరమైన విలన్.. బాలీవుడ్ ఎంట్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్ మొదటి కమెడియన్‌గా సినిమాలు చేసిన సునీల్.. ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా కొన్నేళ్లు బిజీగా సినిమాలు చేశాడు. కాని హీరోగా కొన్ని సినిమాలు కలిసి రాక పోవడంతో.. మళ్లీ కమెడియన్‌గా చేస్తున్నాడు. ఇక పుష్ప సినిమాతో పూర్తిగా విలన్‌గా మారిపోయాడు సునీల్. అంతకు ముందు రవితేజ డిస్కోరాజాలో నెగెటివ్ రోల్ చేసినప్పటికీ.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో విలన్‌గా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పుష్ప సినిమాలో మంగళం శీనుగా అదరగొట్టాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్లో పుష్ప హవా కొనసాగింది. దాంతో అక్కడ సునీల్.. విలన్‌గా ఫేమస్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో.. సునీల్‌కు హిందీలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.
Also Read
- Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
- Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
- Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
- KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
గతంలో సునీల్‌కు హిందీ ఆఫర్లు వచ్చినా.. తన పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ పుష్ప తర్వాత బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నట్టు గతంలో చెప్పుకొచ్చాడు సునీల్. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ఎఫ్ 3లో కీలక పాత్రలో నటించాడు సునీల్. ఈ సందర్భంగా మరోసారి హిందీలో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. వీటిలో ఒక సినిమాలో విలన్ గా నటించబోతున్నాడట.. మరో సినిమాలో హీరో పక్కన ఉండే మెయిన్ కమెడియన్‌గా కనిపించబోతున్నాడట. ఒక్క హిందీ మాత్రమే కాదు.. తమిళ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలిపాడు. ఈ విషయంలో.. సుకుమార్, బన్నీకి తను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నాడు. ఇక ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో.. పుష్ప2లో తన పాత్ర భయంకరంగా ఉంటుందని చెప్పాడు. అలాగే చరణ్, శంకర్ ప్రాజెక్ట్‌లో తన పాత్ర హైలెట్‌గా ఉంటుందని.. తాను ఇప్పటి వరకు అలాంటి రోల్ చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే కమెడియన్‌గానే కాదు.. త్వరలోనే హీరోగా కూడా సినిమాలు చేయబోతున్నాడట. ఏదేమైనా సునీల్ ఇప్పుడు సాలిడ్‌గా కమ్ బ్యాక్ అయ్యాడని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!