ప్రముఖ కమెడియన్ కు హార్ట్ సర్జరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని టాప్ కమెడియన్లలో సునీల్ గ్రోవర్ ఒకరు. ఆయన కపిల్ శర్మ కామెడీ షోతో పాటు సినిమాల్లో అనేక పాత్రలు చేసి పాపులర్ అయ్యాడు. సునీల్ గ్రోవర్ ‘ది కపిల్ శర్మ’ షోలో గుత్తి, డాక్టర్ మషూర్ గులాటీ పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. సునీల్ ఇప్పుడు ముంబైలో అకస్మాత్తుగా హార్ట్ సర్జరీ చేయించుకోవడం చర్చనీయంశంగా మారింది. సునీల్ కు తన వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఉండగా ఛాతీ నొప్పి వచ్చిందట. దీంతో చిత్రబృందం అతన్ని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సునీల్ గ్రోవర్ ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు.
Read Also : ‘గాడ్ ఫాదర్’ అప్డేట్… హైదరాబాద్ లో స్టార్ హీరోయిన్
Also Read
అయితే ఎలాంటి సర్జరీ చేయించుకున్నాడో మాత్రం గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడి ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఓ ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను పంచుకున్నారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. గుండెలో నొప్పి ఉన్నపటికీ షూట్ పూర్తి చేసే సర్జరీకి వెళ్ళాడట ఈ పాపులర్ కమెడియన్.
సునీల్ గ్రోవర్ చివరిగా Zee5 వెబ్ సిరీస్ ‘స్నో ఫ్లవర్’లో, గత సంవత్సరం సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి ‘తాండవ్’లో కూడా కనిపించాడు. నటుడు సిరీస్‌లో కీలక పాత్ర పోషించాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో రాజకీయ నాటకం వివాదంలో ఉంది. పెద్ద తెరపై సునీల్ చివరిగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లతో కలిసి ‘భరత్’లో కనిపించాడు. ఈ సినిమాలో సల్మాన్ స్నేహితుడిగా నటించాడు.
తాజావార్తలు
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?