‘ప్రస్థానం’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేసి… ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. రొటీన్ లవ్ స్టొరీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్‌లో మంచి హిట్స్ అందుకున్న సందీప్ కిషన్, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. సందీప్ కిషన్‌కి హిట్ మాత్రం అందని ద్రాక్షాగానే ఉంది. టాలెంట్ ఉండి, మంచి కాంటాక్ట్స్ ఉండి లక్ మాత్రమే లేని హీరోగా సందీప్ కిషన్ కెరీర్ సాగిస్తున్నాడు కానీ తిరిగి కెరీర్‌ను హిట్ ట్రాక్ ఎక్కాలి అనే కసితో సినిమాలు చేస్తునే ఉన్నాడు సందీప్. అంతేకాదు… లాస్ట్ ఇయర్ ‘మైఖేల్’ అనే సినిమా పాన్ ఇండియా ఎంట్రీ కూడా ఇచ్చాడు. అయినా కూడా మైఖేల్ డిసప్పాయింట్ చేసింది.
రీసెంట్‌గా ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేశాడు సందీప్. ఇక ఇప్పుడు హీరోగా ఊరు పేరు భైరవకోన అనే సినిమాతో థియేటర్లోకి రాబోతున్నాడు. విఐ ఆనంద్ గ్రాండ్‌గా తెరకెక్కించిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఊరు పేరు భైరవకోన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమా మంచి హైప్ క్రియేట్ చేశాయి. దీంతో రిలీజ్ కి రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు మేకర్స్. ప్రీమియర్స్ నుంచి టాక్ బాగానే ఉంది… అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఈ టాక్ ని మేకర్స్ ప్రమోట్ చేసుకోగలిగితే రిలీజ్ రోజున మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతోనైనా సందీప్ హిట్ కొడతాడేమో చూడాలి.