NTV Telugu Site icon

Sundar C : మరో సినిమాను రిలీజ్ చేస్తున్న సుందర్. సి

Sundar

Sundar

హార్రర్- మసాలా తీసి హిట్స్ అందుకోవడంలో ఈ దర్శకుడు పీహెచ్‌డీ చేశాడు. దెయ్యాలతో చెడుగుడు ఆడటంతో పాటు  క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ స్టోరీలతో ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అలాగే కామెడీని పండించడంలో కూడా దిట్టే. నటనలోనూ ప్రావీణ్యం సాధించాడు. రీసెంట్లీ బాక్సాఫీస్ టార్గెట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను దింపేస్తున్న హీరో కమ్ డైరెక్టర్  సుందర్ సి. 90ల్లోనే దర్శకుడిగా సూపర్ సక్సెస్ కొట్టి నటనపై ఇంట్రస్టుతో హీరోగా మేకోవర్ అయ్యాడు. మెగా ఫోన్ పడుతూ గ్యాప్‌లో యాక్టింగ్ చేస్తున్నాడు. దర్శకుడిగా 12 ఏళ్ల క్రితం పూర్తి చేసిన మదగజరాజాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేసి ఊహించని హిట్ అందుకున్న సుందర్  ఇదే జనవరికి తాను హీరోగా నటించిన సినిమాను పట్టుకొస్తున్నాడు.

Also Read : Mrunal Thakur : టాలీవుడ్ కు టాటా చెప్పేస్తున్న టాల్ బ్యూటీ

సుందర్ సి అనగానే చాలా మందికి హారర్ మూవీసే గుర్తుకు వస్తాయి. అరణ్మనై ఫ్రాంచేజీ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా మారిన ఈ పిల్మ్ మేకర్ క్రైమ్ అండ్ మిస్టరీ, రొమాంటిక్ కామెడీలను తీయడంలో దిట్ట. ఓ వైపు దర్శకుడిగా బిజీగా ఉంటూనే మరో వైపు వీలు చిక్కినప్పుడల్లా కెమెరా ముందుకు వస్తుంటాడు. రీసెంట్లీ హీరోగా నటించిన వల్లన్ సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నాడు. జనవరి 24న మిస్టరీ థ్రిల్లర్ మూవీని దించేస్తున్నాడు.
2022 నుండి షూటింగ్ చేస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టి ఈ నెలలోనే థియేటర్లలోకి రాబోతుంది. కట్టప్పవ కనోమ్ ఫేం మణి సేయన్ వల్లన్‌కు దర్శకుడు. తాన్యా హోప్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ కామరాజ్, హెబ్బా పటేల్ కీ రోల్స్ చేస్తున్నారు. మరీ దర్శకుడిగా హిట్ చూసిన సుందర్ సి హీరోగా సక్సెస్ అందుకుంటాడో లేదో చూద్దాం.