OG : ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. దీంతో సుజీత్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రమోషన్లలో భాగంగా సుజీత్ ఓ విషయం బయట పెట్టాడు. పవన్ కల్యాణ్ నాకు ఫేవరెట్ హీరో. ఆయనకు వీరాభిమాని నేను. ఆయనతో సినిమా అంటే ఒక భయం ఉండేది. ఓజీపై మొదటి నుంచే అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఏ మాత్రం తేడా వచ్చినా నన్ను ఫ్యాన్స్ వదలరు. నన్ను ట్రోల్స్ చేస్తారని తెలుసు. ఆ భయం ఎప్పటికీ ఉండేది. అందుకే నేను ఒక ఫ్యాన్ బాయ్ గానే ఓజీ సినిమాను తీశాను.
Read Also : Manchu Manoj : నా బయోపిక్ ఆ డైరెక్టరే తీయాలి.. మనోజ్ కామెంట్స్
ఒక అభిమానిగా సినిమా చేస్తే.. పవన్ ఫ్యాన్స్ ఎలా ఊహిస్తారో నేను అలాగే ఊహించాను. అప్పుడు నాకు నచ్చితే కచ్చితంగా వాళ్లకు నచ్చుతుందనే నమ్మకం ఏర్పడింది. అందుకే సినిమా రిజల్ట్ ఇంత బాగా వచ్చింది అంటూ తెలిపాడు సుజీత్. నాకు పవన్ కల్యాణ్ గారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన సినిమాలకు హెడ్ బ్యాండ్స్ కట్టుకుని వెళ్లాను. గబ్బర్ సింగ్ సినిమాను థియేటర్ లో చూసి అరిచాను. ఇప్పుడు నేను సినిమా చేసి హిట్ కొట్టడం ఎప్పటికీ మర్చిపోను అంటూ చెప్పుకొచ్చాడు సుజీత్.
Read Also : Little Hearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ..?
