Site icon NTV Telugu

Suhas: వస్తాడు.. హిట్ కొడతాడు.. రిపీట్

Suhas

Suhas

Suhas: ఒక విజయవాడ కుర్రాడు.. చూడడానికి కొంచెం నల్లగా ఉంటాడు. సినిమా మీద ఆశతో ఇండస్ట్రీలో ఎదగాలని హైదరాబాద్ వచ్చాడు. అప్పుడే యూట్యూబ్ లో ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ నడుస్తున్నాయి. అలా.. ఆ కుర్రాడు ఛాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాడు. అలా కెరీర్ ను స్టార్ట్ చేసి.. కమెడియన్ గా మారాడు. ఇక ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా అతడిని హీరోగా నిలబెట్టింది. హీరోగా మారాక.. అవే పాత్రలు చేయాలనీ మంకు పట్టు పట్టకుండా తనలోని నటుడును బయటపెడుతున్నాడు. కమెడియన్ గా, విలన్ గా, హీరోగా వరుస సినిమాలను చేస్తూ మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా కథలు ఎంచుకోవడంలో ఆ హీరో పెట్టే శ్రద్ద ఏదైతే ఉందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఏ అన్ని చెప్తున్నారు కానీ, హీరో పేరు చెప్పడంలేదు అనుకుంటున్నారా.. అతనే సుహాస్. కలర్ ఫోటో సినిమాతో వెండితెరకు పరిచయమైన బంగారు హుండీ. మొదటి సినిమానే నేషనల్ అవార్డు అందుకుంది.

ఇక ఆ తరువాత రైటర్ పద్మభూషణ్ తో సెకండ్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ రెండు హిట్స్ ను మరిపించేలా.. ఇప్పుడు మూడో హిట్ ను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో అందుకున్నాడు. నటనతో ప్రేక్షకులను ఏడిపించేశాడు. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని ముందుకు దూసుకెళ్తుంది. పాత్రకోసం ఎలాంటి రిస్క్ చేయడానికి అయినా కూడా సుహాస్ వెనుకాడడు అనడానికి ఈ సినిమానే నిదర్శనం. ఈ సినిమా కోసం రెండుసార్లు సుహాస్ గుండు గీయించుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో అయితే ఆ న్యాచురల్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ముందు ముందు సుహాస్ పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వస్తాడు.. హిట్ కొడతాడు.. రిపీట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం సుహాస్ చేతిలో మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలతో ఈ విజయవాడ కుర్రాడు ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version