‘చిలసౌ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ రుహాని శర్మ .. మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఎంతో పద్దతిగా కనిపించిన ఈ భామ ఆ తరువాత హిట్ చిత్రంలో మోడ్రన్ లుక్ లో మెరిసింది. ఇక ‘డర్టీ హరి’ చిత్రంలో కీలక పాత్ర పోషించి హిట్ అందుకున్న రుహని ఇటీవల విడుదలైన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రంతో మంచి మార్కులనే కొట్టేసింది. వరుస సినిమా అవకాశాలను అందుకొంటూనే సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్లతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది.
తాజాగా రుహని లేటెస్ట్ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతోంది. నాచు కలర్ వన్ పీస్ డ్రెస్ లో బెడ్ పై ఒక వైపు ఒదిగి పడుకొని ఎద అందాలను ఓరగా ఒలకబోస్తూ కిల్లింగ్ లుక్ తో పిచ్చెక్కిస్తోంది. నీ సొంత వాయిస్ ని వినండి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. ఇక ఇంతటి అందాన్ని చుసిన నెటిజన్స్ వావ్ .. సూపర్ అంటూ కామెంట్స్ తో రెచ్చిపోయారు.
