Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!

Sudheer Joker

Sudheer Joker

బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్న హీరో సుడిగాలి సుధీర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సుధీర్ నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘సుధీర్ జోకర్’ మూవీ అఫీషియల్ బ్యాంగర్‌ను అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఇంటరాక్షన్ కార్యక్రమంతో పాటు జరిగిన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో చిత్ర యూనిట్ అంతా పాల్గొని సందడి చేసింది. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్‌ను విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సినిమా బ్యాంగర్ లీడ్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. నగరంలో వరుసగా జరిగే వింత దొంగతనాల చుట్టూ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. ఈ చోరీలకు పాల్పడుతుంది ఎవరో కాదు.. ఒక పెద్ద రాయల్ ఫ్యామిలీకి చెందిన సంపన్న యువకుడే అని పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తుంది. అసలు అంత పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టిన హీరో.. దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? అతని అసలు ప్లాన్ ఏంటి? అనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్వాలిటీ విజువల్స్, లియోన్ జేమ్స్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సరికొత్త షాట్ మేకింగ్ ఈ బ్యాంగర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ స్క్రీన్ ప్రెజెన్స్, కొత్త లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది.