Narayana & Co: తిక్కల్ ఫ్యామిలీ మెంబర్ గా సుధాకర్ కోమాకుల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudhakar Komakula: యంగ్ హీరో సుధాకర్ కోమాకుల ప్రస్తుతం చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు… పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. శుక్రవారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘నారాయణ & కో’ అనే టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ హీరో, అతని కుటుంబాన్ని పరిచయం చేస్తోంది. ‘ఎక్స్ పీరియన్స్ ది తిక్కల్ ఫ్యామిలీ’ అని పోస్టర్ పై వుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పోస్టర్ లోని పాత్రధారులంతా పగలబడి నవ్వడం చూస్తుంటే, ఇదో విలక్షణమైన కుటుంబ కథా చిత్రమని అనిపిస్తోంది. ఆమని, దేవి ప్రసాద్ ఇద్దరు అబ్బాయిల తల్లిదండ్రులుగా నటించారు. ‘నారాయణ & కో హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్థమౌతోంది. ఆమని, దేవి ప్రసాద్, జై కృష్ణ, పూజా కిరణ్, ఆరతి పొడి, యామిని బండారు, సప్తగిరి, అలీ రెజా, శివ రామచంద్రపు, తోటపల్లి మధు, రాగిణి, అనంత్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగవంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్ సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చాడు. రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?