Sudha Kongara: చిక్కులో సూర్య డైరెక్టర్.. క్షమాపణ చెప్పి తీరాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudha Kongara: గురు, ఆకాశం నీ హద్దురా సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయింది సుధా కొంగర. ఈ సినిమా తరువాత ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రస్తుతం సూర్యతో కలిసి మరో సినిమా చేస్తోంది. ఇక ఇప్పటివరకు ఎటువంటి వివాదాల జోలికి పోనీ సుధా.. తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. అయితే.. అదేదో ఇప్పుడు జరిగింది కూడా కాదు. ఎన్నో ఏళ్ల క్రితం సుధా అన్న కొన్ని వ్యాఖ్యలు.. ఇప్పుడు వివాదాన్ని తీసుకొచ్చి పెట్టాయి. అసలు విషయం ఏంటంటే.. నిర్మాత జ్ఞానవేల్ రాజా కు డైరెక్టర్ అమీర్ కు మధ్య ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. ఒక సినిమా విషయంలో జ్ఞానవేల్ రాజా తనకు అన్యాయం చేశాడని అమీర్ ఆరోపించాడు. ఈ వివాదం గురించి గత కొన్నిరోజులుగా చర్చలు నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో జ్ఞానవేల్ రాజా.. గతంలో సుధా కొంగర, అమీర్ తీసిన సినిమా గురించి మాట్లాడిన మాటలను బయటపెట్టాడు. పరుత్తివీరన్ కన్నా ముందు అమీర్.. జీవా హీరోగా రామ్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా చూసిన సుధా.. మేకింగ్ సరిగ్గా లేదని, సినిమా అస్సలు బాగోలేదని సగంలోనే థియేటర్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పాడు. ఇక ఆ వ్యాఖ్యలకు అమీర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సుధా కొంగరపై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది సుధా కొంగర.
Suriya : మమ్ముట్టి సినిమాపై ప్రశంసలు కురిపించిన సూర్య..
Also Read
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
ట్విట్టర్ వేదికగా ఆమె మాట్లాడుతూ.. “ఫిబ్రవరి 2, 2016. నాకు అమీర్ అన్న నుండి కాల్ వచ్చింది .నేను ప్రసాద్ స్టూడియోస్ బయట డ్రైవింగ్ చేస్తున్నాను. ఇరుధి సుట్రు విజయం తరువాత పరిశ్రమ నుంచి నన్ను ప్రశంసించిన మొదటి వ్యక్తి కాబట్టి ఆ క్షణం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది.. నేను అతనితో ఒక విషయం చెప్పాను, నా మది పాత్రకు పరుత్తివీరన్ లోని హీరోయిన్ పాత్ర నుండి ప్రేరణ పొందింది. నేను ఒక పురుషుడు వ్రాసిన గొప్ప స్త్రీ పాత్రలలో ఒకదానిని గురించి కొనసాగించాను. మధి పాత్రలో నటించిన నటీమణులు మరియు ఆ తర్వాత బొమ్మి పాత్రలో నటించిన నటీమణులు ఇద్దరినీ నేను పరుత్తివీరన్ని రిఫరెన్స్‌గా చూసాను. మరియు ఇది తమిళ సినిమా యొక్క మాస్టర్ ఫిల్మ్ మేకర్‌కి నా నివాళి. నేను చెప్పేది ఒక్కటే” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు.. ఇవన్నీ కాదు.. అమీర్ కు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
Feb 2nd 2016. I got a call from Ameer Anna .I was driving outside Prasad Studios. I remember the exact moment because he was one of the first and few from the industry to call and praise me for Irudhi Suttru. I just told him one thing then, my Madhi is inspired by Muthazhugu. I…
— Sudha Kongara (@Sudha_Kongara) November 26, 2023
తాజావార్తలు
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!