Lyca : సుభాస్కరన్ ప్రెజెంట్స్.. లైకా ప్రొడక్షన్స్ కేరాఫ్ డిజాస్టర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లైకా ప్రొడక్షన్స్ అంటే ఫ్లాపులకు డిజాస్టర్స్కు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఏ హీరో నటించినా ఫ్లాప్ గ్యారెంటీ అనేట్టుగా మారిపోయింది. పొన్నియన్ సెల్వన్‌తో మంచి లాభాలు చూసిన లైకా ఆతర్వాత డిజాస్టర్స్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మూడేళ్లనుంచి లైకా నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేస్తున్నాయి. అజిత్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘విదామయూర్చి’ వీకెండ్ సినిమాగా మిగిలిపోయింది. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజై కోటి కూడా కలెక్ట్ చేయలేయలేదు. అజిత్‌కు తమిళంలో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్నా సరైన కథ ట్రీట్మెంట్ లేకపోవడంతో తమిళ తంబీలు రిజక్ట్ చేశారు.
Also Read : Tollywood : సమ్మర్ హాలిడేస్ కు ఇద్దరు స్టార్ హీరోలు
Also Read
- Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
- Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
- Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
- Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
కూతురు ఐశ్వర్య డైరెక్షన్లో రజనీకాంత్ నటించిన ‘లాల్ సలాం’ లైకాను కోలుకోలేనంతగా దెబ్బ కొట్టింది. రజనీకాంత్‌తో తీసిన ‘వెట్టయాన్’కూడా యావరేజ్ గా నిలిచింది. లైకా నుంచి ఏది వచ్చినా ఫ్లాప్ బాటే పట్టడం కోలీవుడ్‌ను కలవరపెడుతోంది. హిందీలో అక్షయ్‌కుమార్‌తో తీసిన రామ్‌సేతు బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి2 మరో మరో ప్లాప్. ఇక భారతీయుడు2 అయితే విమర్శలతోపాటు వందల కోట్లు నష్టాలతో ప్రొడక్షన్ హౌస్‌ను ముంచింది. ఇక లైకా ప్రొడక్షన్స్‌ను ఇక లూసిఫర్ సీక్వెలే రక్షిస్తుందనుకుంటే వివాదాలు చుట్టుముట్టాయి. హైప్ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చినా పృథ్వీరాజ్‌కు మాత్రం చెడ్డ పేరు తీసుకొచ్చింది. పెద్ద పెద్ద హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ తీసిన లైకా ప్రొడక్షన్స్ చేతిలో ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా విజయ్ కొడుకు దర్శకత్వంలో సినిమాతో పాటు మరో సినిమా మాత్రమే ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న లైకాకు ఫండర్ దొరకాలి. అలాగే మంచి కథలతో బౌన్స్ బ్యాక్ అవ్వాలి. లేదంటే లైకా మరో ప్లాప్ బ్యానర్ గా దుకాణం సర్దేయాల్సి వస్తుంది.
తాజావార్తలు
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!