తాజాగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్‌నాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ . నాలుగు బ్లాక్‌బస్టర్ సీజన్లతో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌కి ఇప్పుడు మరింత హైప్ పెరిగింది. తాజాగా ఐదో సీజన్ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సీజన్ 5ని రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సీజన్‌లో ప్రతి ఎపిసోడ్ రన్‌టైమ్ ఏకంగా రెండు గంటలు ఉంటుందని సమాచారం బయటకు రావడంతో అభిమానుల్లో సరికొత్త ఎగ్జైట్మెంట్ మొదలైంది. సాధారణంగా వెబ్ సిరీస్‌ల ఎపిసోడ్లు గంట సమయాన్ని కూడా దాటవు, కానీ ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ మాత్రం సినిమాల తరహాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
Also Read : Bunnyvasu : ‘మిత్ర మండలి’ ప్రమోషన్ వేడుకలో.. బండ్ల గణేష్ బన్నీ వాస్ ఘర్షణ?
ఈ సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కే సుమారు 50 నుండి 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నందున విజువల్‌గా మరింత గ్రాండియర్ అనిపించేలా సిరీస్‌ను తీర్చిదిద్దుతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇక ఈ సీజన్ మొదటి వాల్యూమ్‌ను నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఒక్కో ఎపిసోడ్ రన్‌టైమ్ నిజంగానే రెండు గంటలదా లేక రూమర్ మాత్రమేనా అన్నది అప్పుడే తేలనుంది. ఏదేమైనా, ఈ సీజన్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.