హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా నిలిచింది ఏక్తా కపూర్. సీరియల్స్ నుంచి సినిమాలు, వెబ్ సీరీస్ ల వరకూ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి ఇచ్చింది ఏక్తా కపూర్. ఆల్ట్ బాలాజీ యాప్ ని క్రియేట్ చేసి మరీ ప్రేక్షకులని అలరిస్తున్న ఏక్తా కపూర్… రాగిణీ MMS, డర్టీ పిక్చర్, ఉడ్తా పంజాబ్, ఏక్ విలన్ లాంటి ఎన్నో సినిమాలని హిందీలో ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ వైపు అడుగులు వేస్తోంది. కెనెక్ట్ మీడియా, AVS స్టూడియోస్ తో టైఅప్ అయ్యి ఏక్తా కపూర్ ‘వృషభ’ అనే పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ ప్లే చేస్తున్నాడు. నందకిషోర్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నాలుగో వారం నుంచి స్టార్ట్ కానుంది. వృషభ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి చేసిన ఫోటోషూట్ కోసం మోహన్ లాల్ ముంబై వచ్చాడు. సూపర్ స్టార్ జితేంద్ర కూడా ఈ ఫోటోషూట్ లో పాల్గొన్నాడు. బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వృషభ సినిమా 200 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఏక్తా కపూర్ సోషల్ మీడియాలో జితేంద్ర, మోహన్ లాల్ తో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేస్తూ… “ది లెజెండ్ అండ్ ది జీనియస్‌తో ఫోటోలకి పోజులిస్తున్నాను !!!! జై మాతా ది, మోహన్‌లాల్‌తో సమానమైన నటుడితో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. వృషభ సినిమాని బాలాజీ టెలిఫిల్మ్స్, కన్నెక్ట్ మీడియా మరియు AVS స్టూడియోస్‌తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మెగాస్టార్ మోహన్‌లాల్ మెయిన్ క్యారెక్టర్ లో నటించారు. ఎమోషన్స్ మరియు విఎఫ్‌ఎక్స్‌తో కూడిన ఈ చిత్రం ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దర్శకుడు నంద కిషోర్ ‘వృషభ’ సినిమాని 2024లో అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా, చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచేలా రూపొందించనున్నాడు. ఈ నెలాఖరులో సెట్స్‌పైకి వెళ్లి మళయాళం, తెలుగు, కన్నడ, తమిళం మరియు హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది” అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వృషభ ఫోటోషూట్ నుంచి బయటకి వచ్చిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.