Site icon NTV Telugu

Tollywood : రీరిలీజ్ లో పోటి పడుతున్న స్టార్ హీరోలు

Re Release

Re Release

ఈ ఏడాది సమ్మర్ ఏమంత ఆశాజనకంగా లేదు. మరి ముఖ్యంగా మే నెల చప్పగా సాగుతోంది. భారీ అంచనాల మధ్య వచ్చింది హిట్ 3. మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి మూడు రోజులు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి సోమవారం స్లో అయింది. ఫైనల్ రన్ లో ఆంధ్రలోని కొన్ని ఏరియాలు నష్టాలు తప్పవు. ఇక శ్రీ విష్ణు సింగిల్ డిస్టిబ్యూటర్స్ కు కాస్త ఉపశమనం కలిగించిం ది. ఇక ఈ నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు.

Also Read : AA22 : అల్లు అర్జున్ – అట్లీ సినిమా.. రిలీజ్ డేట్ లాక్

ఈ నేపధ్యంలో రీరిలీజ్ సినిమాలు క్యూ కట్టాయి. ఏకంగా నాలుగురు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ కు రెడీ అయ్యాయి. వాటిలో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘జల్సా’ మే 16న రిలీజ్ కానుంది. ఇక రెండు రోజుల గ్యాప్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాలు నైజాం లో రీరిలీజ్ చేస్తోంది. ఇక వారం గ్యాప్ లో రెబల్ స్టార్ కెరీర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ వర్షం మే 23న థియేటర్స్ లోకి వస్తుంది. ఇక ఈ నెలాఖరున సూపర్ స్టార్ మహేశ్ ఖలేజా మే 30న రీరిలీజ్ కానుంది. అలాగే 31న మహేశ్ మరో సినిమా అథితి రీరిలీజ్ అవుతోంది. ఇలా ఈ నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో రీరిలీజ్ సినిమాలకు మంచి స్పేస్ దొరికింది. ఇటీవల రీరిలీజ్ సినిమాలు అంతగా కలెక్షన్స్ రాబట్టడం లేదు. మరి ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమా కలెక్షన్స్ రాబడతాయో చూడాలి.

Exit mobile version