Site icon NTV Telugu

Tollywood : ఓవర్సీస్ కంటెంట్ డెలివరి చేయలేక చేతులెత్తేసిన ‘స్టార్’ సినిమా మేకర్స్

Tollywood (1)

Tollywood (1)

వందల కోట్ల బడ్జెట్స్ తో సినిమాలు నిర్మించే మేకర్స్ రిలీజ్ కు కొన్ని గంటల ముందు వరకు కూడా కంటెంట్ డెలివరి చేయలేక కిందా మీదా అవుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ కంటెంట్ ను రిలీజ్ రోజు కేవలం కొన్ని గంటల ముందు డెలివరి చేసినవి చాలా సినిమాలు ఉన్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ తెలుగు స్టేట్స్ కంటే కొన్ని గంటల ముందు స్టార్ట్ అవుతాయి. అయినప్పటికి చివరి నిమిషంలో చెక్కుతూ ఉంటారు మేకర్స్. ఇప్పుడు మరో తెలుగు బిగ్ బడ్జెట్, భారీ హైప్ ఉన్న సినిమా కంటెంట్‌ను సమయానికి డెలివరీ చేయలేక చేతులెత్తేసింది. ట్రైలర్ ను సరైన టైమ్ లో రిలీజ్ చేయని నిర్మాణ సంస్థ ఓవర్సీస్ కంటెంట్ ను ఇంకా అప్ లోడ్ చేయలేదు. ఫలితం ఓవర్సీస్ లోని కొన్ని థియేటర్స్ లో షోస్ క్యాన్సిల్ చేసేస్తున్నారు.

Also Read : Tollywood : సెప్టెంబరులో కళకళలాడిన టాలీవుడ్

ఓవర్సీస్ బయ్యర్స్ కి ఈ చివరి నిమిషంలో కంటెంట్ జాప్యాలు నిరంతర సిరియల్ లా మారింది. దాంతో విదేశీ పంపిణీదారులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. అటు అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు. దాంతో పాటు అక్కడి థియేటర్ చైన్‌లు క్రమంగా మన బయ్యర్స్ పై నమ్మకాన్ని కోల్పోతున్నాయి. భారీగా షోస్ అలకేట్ చేయడం తీరా కంటెంట్ అందక షోస్ క్యాన్సిల్ చేయడం. అదేమంటే పర్ఫెక్షన్ కోసం వర్క్ జరుగుతుందని సాకు చెప్పడం. పోనీ ఫైనల్ అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా ఇస్తున్నారా అంటే అది లేదు. ఓవర్సీస్ ప్రింట్‌లు ఎప్పుడు లిప్-సింక్ సమస్యలు, నాసిరకం మిక్సింగ్, పూర్ VFX మరియు ఫార్మాట్ లోపాలు వంటి   సమస్యలతో ఇస్తున్నారు. అంత నాసిరకంగా ఉన్న కూడా నిర్మాత చెప్పిన ధరకు పంపిణీదారులు చెల్లించాల్సి వస్తుంది. క్వాలిటీ గురించి అడిగితె మాత్రం నిర్మాణ సంస్థలు నోరుమెదపవు. టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి మాత్రమే కంటెంట్‌ను ముందుగానే లాక్  చేసి డెలివరీ చేసి IMAX, డాల్బీ విజన్ మరియు ఇతర ఫార్మాట్‌లు పర్ఫెక్ట్ గా కంటెంట్ అందిస్తారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఓవర్సీస్ లో తెలుగు సినిమాను కొనేవారు ఉండరు.

 

Exit mobile version