NTV Telugu Site icon

Cricket Stars : స్టార్ క్రికెటర్లు.. క్రికెట్ కు గుడ్ బై.. సినిమాలకు సై..సై

Ganguly

ganguly

డేవిడ్ వార్నర్ పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా ఐపీఎల్ పుణ్యమా అని తెలుగు వాళ్లకు చేరువయ్యాడు. కేవలం క్రికెట్‌తోనే ఆకట్టుకోలేదు. తెలుగు సినిమాల్లోని ఫేమస్ పాటలకు స్టెప్పులేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. దీంతో సినిమాల్లో నటిస్తున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. రీసెంట్లీ ఈ న్యూసులే నిజమయ్యాయి. నితిన్ – వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత్లలో ఒకరైన రవిశంకర్ లీక్ చేసేశారు. దీంతో సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చేసింది.

Also Read : Samantha : టాలీవుడ్ కంబ్యాక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

డేవిడ్ వార్నర్‌లా ఇప్పుడు మరో స్టార్ ఇండియన్ క్రికెటర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు మరెవ్వరో కాదు.. క్రికెట్ రంగానికి అసలు సిసలైన వన్నె తెచ్చిన స్పోర్ట్ మ్యాన్ గంగూలీ. ఖాకీ2లో అతిధి పాత్ర చేయబోతున్నాడని టాక్ వస్తుంది. ఖాకీ ది బెంగాల్ చాప్టర్ వెబ్ సిరీస్ లో గంగూలీ ఉన్నారని నిర్మాత నీరజ్ పాండేను అడిగితే  తినబోతూ రుచి ఎందుకు అడుగుతున్నారంటూ దాటవేశాడు. మార్చి 20న ఖాకీ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా రంగంలోకి క్రికెటర్లు రావడం ఇప్పుడు కొత్తకాదు. కొన్నేళ్ళ నుండి ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అజయ్ జడేజా, అనిల్ కాంబ్లీ, వినోద్ కాంబ్లీ, యువరాజ్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, బ్రెట్ లీ ఇలా స్టార్ క్రికెటర్లు.. ఎప్పుడో ఏదో ఒక టైంలో మేకప్ వేసుకున్నవాళ్లే. కొంత మంది గెస్ట్ అప్పీరియన్సులకే పరిమితమైతే మరికొంత మంది క్రికెటర్లు ఫుల్ లెంత్ రోల్‌లో మెస్మరైజ్ చేశారు. మూవీకి వీళ్లు ఎంత వరకు హెల్ప్ అయ్యారనేది పక్కన పెడితే క్రికెటర్లకు ఉండే క్రేజ్‌ యూజ్ చేసుకోవాలని ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి తెస్తున్నారు దర్శక నిర్మాతలు.