టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబోలో తేరకెక్కుతున్న SSMB29 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారం నుంచి మొదలుకానుంది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మించారట. ఈ షెడ్యూల్ చాలా కీలకమని, అందులో ప్రధాన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని టాక్ వినిపిస్తోంది. ముందు నుంచి కూడా ఈ మూవీకి సంబంధించిన ఏ వార్త కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఈ వార్త అయితే వైరల్ అవుతుంది.
Also Read : Rao Bahadur: ‘రావు బహదూర్’.. టీజర్ రిలీజ్
ఇక మహేశ్ బాబు ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో, వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. ఇక కథ విషయానికి వస్తే, రచయిత విజయేంద్ర ప్రసాద్ “నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ అభిమానులం. ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ కథ రాశాం” అని ఇంతకు ముందే చెప్పారు. దీంతో ఈ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనుందని స్పష్టమైంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటించగా మొత్తం మీద, రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 ఇండియన్ సినిమా చరిత్రలో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
