NTV Telugu Site icon

RC15: SSMB28 రిలీజ్.. RC15 వాయిదా..?

Charan

Charan

RC15: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ పాడుకుంటున్నారు మహేష్ అభిమానులు. గతేడాది మొదట్లో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో ఉంటుందని పుకార్లు వచ్చాయ.. ఏడాది మధ్యలో అవి పుకార్లు కాదు నిజమే అని SSMB28 ని మేకర్స్ ప్రకటించారు. ఇక గతేడాది చివర్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఏ ముహూర్తాన పూజా కానిచ్చారో.. అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ జరగడం, ఆగడం.. మళ్లీ జరగడం, ఆగడం.. జరుగుతూనే ఉన్నాయి. ఇక కొత్త ఏడాది నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా SSMB28 కొనసాగుతోంది. మేకర్స్ సైతం అభిమానులను నిరుత్సాహపడకుండా మహేష్ లుక్ ను, సెట్ లో ఇతర నటీనటులను ఎప్పటికప్పుడు చూపిస్తూ జోష్ పెంచుతున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. అదేంటి సర్ ప్రైజ్ కదా ఇచ్చింది.. షాక్ అంటారేంటి అనుకుంటున్నారా..? అవును ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ఉంటుందని తెగ సంబరపడిపోతున్న ఫ్యాన్స్ కు ఇది షాకే. మహేష్ ను ఈ ఏడాది అంతా థియేటర్ లో చూడలేరు.

Smriti Irani: సిగ్గులేదా.. నీకు అని అతడు నన్ను అవమానించాడు

ఇంకోపక్క రామ్ చరణ్ అభిమానులు అయితే ఏం తెలియని అయోమయంలో పడిపోయారు. ఎందుకు అంటారా..? మొదటి నుంచి RC15 సంక్రాంతి బరిలో ఉంది. ఇప్పుడు అదే బరిలోకి మహేష్ వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు RC15 పొజిషన్ ఏంటి..? అదేంటి రెండు సినిమాలు పోటీ పడతాయి అనుకుందాం. కానీ, మహేష్ సినిమా నైఙాం, వైఙాగ్ విడుదల చేసేది దిల్ రాజునే. RC15 ను దాదాపు 100 కోట్లు పెట్టి నిర్మిస్తుంది కూడా హార్ట్ కింగునే. మరి ఈ రెండు సినిమాలను రోజు తేడాలో విడుదల చేస్తే ఆయనకు ఎంత నష్టం వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నష్టం గురించి పక్కన పెడితే.. థియేటర్ల దగ్గర పెద్ద గొడవ అనే చెప్పాలి. ఇంకోపక్క ఇదే సంక్రాంతికి ప్రాజెక్ట్ కె తో ప్రభాస్ సిద్ధంగా ఉన్నాడు. దీంతో RC15 వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఒక వేళ RC15 ఇప్పుడు వాయిదా పడితే ఎప్పుడు వస్తుంది అంటే.. సమ్మర్ అనే చెప్పుకోవాలి. మరి కొన్నిరోజుల్లో దిల్ రాజు ఏమైనా అధికారిక ప్రకటన ఇస్తాడేమో చూడాలి.

Show comments