SS Thaman Responds on Social Media trolls: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన ‘బ్రో’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మీడియాతో ముచ్చటించిన థమన్ సోషల్ మీడియా ట్రోల్స్, అలాగే గుంటూరు కారం సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ట్రోల్స్ ని పట్టించుకుంటారా? అని ఆయన్ని అడిగితే ట్రోల్స్ చూస్తుంటే ఉంటానన్న ఆయన అందులో మంచిని తీసుకుంటాను, చెడుని పక్కన పెట్టేస్తానని అన్నారు. ప్రశంసలు తీసుకున్నప్పుడు, విమర్శలు కూడా తీసుకోగలగాలన్న థమన్ నేను సంగీతం మీద ఎంత శ్రద్ధ పెడతానో, సంగీతం కోసం ఎంతో కష్టపడతానో మా దర్శక నిర్మాతలకు తెలుసని అన్నారు. కొందరేదో కావాలని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే, మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు.
SS Thaman: అభిమానుల నుంచి ప్రెజర్.. అవి చూసి తేజ్ ఏడ్చేశాడన్న థమన్
ఇక మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా గురించి చెప్పండని అడిగితే ఆరు నెలల నుంచి ఆ సినిమా మీద పని చేస్తున్నామని అన్నారు. బయట జరిగే అసత్య ప్రచారాలను పట్టించుకోకండని కోరిన ఆయన ఏదైనా ఉంటే నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. ఇక. కావాలని ఎవరూ ఫ్లాప్ సినిమాలు చేయరు, కొన్ని సార్లు సినిమా ఆలస్యమవ్వడం అనేది సహజం అని, దానిని భూతద్దంలో పెట్టి చూస్తూ పదే పదే దాని గురించి రాయాల్సిన అవసరంలేదని అన్నారు. అలాగే ఒకేసారి ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతున్నారు అని అడిగితే నేను ఈ స్థాయికి రావడానికి 25 ఏళ్ళు పట్టిందని థమన్ అనాన్రు. నేర్చుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చానని, ఒత్తిడిని తట్టుకొని పనిచేయడం నేర్చుకున్నానని అన్నారు.. 2013-14 సమయంలోనే ఒకే ఏడాది నేను పని చేసిన పదికి పైగా సినిమాలు విడుదలయ్యాయన్న థమన్ ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నా, నా వల్ల ఎప్పుడూ ఆలస్యం అవ్వదని,. రాత్రి పగలు అనే తేడా లేకుండా కస్టపడి సమయానికి సంగీతం పూర్తి చేస్తానని అన్నారు.