టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఇటీవల కాలంలో నిర్మాణంలో ఉన్న బడా చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన తమన్ అమెరికా యాత్ర చేయబోతున్నాడు. అందులో భాగంగా తన లైవ్ కన్సర్ట్ ను అక్టోబర్ 30న డలాస్ లో ఆరంభించబోతున్నాడు. ఆ తర్వాత నవంబర్ 5న న్యూజెర్సీలో, నవంబర్ 7న వాషింగ్ టన్ లో, నవంబరు 26న సాన్ జోస్ లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నాడు. ఈ లైవ్ షోస్ లో పలువురు గాయనీగాయకులు పాల్గొనబోతుండటం విశేషం. ఈ కార్యక్రమాలు ఆహా ఆధ్వర్యంలో నిర్వహించబోతుండటం విశేషం. మరి ప్రస్తుతం అమెరికాలోని పలు ప్రాంతాల్లో కరోనా థర్డ్ వేవ్ ఉధృతం అవుతున్న దశలో ఈ లైవ్ కన్సర్ట్ లకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.
Read Also : మహేష్ బాటలో విజయ్ దేవరకొండ… థియేటర్ రెడీ