ఎస్.ఎస్. రాజమౌళి సినిమా తీయడంలోనే కాదు, ఆ సినిమాను ఎప్పుడు జనం ముందుకు తీసుకురావాలనే ‘ప్లానింగ్’లో కూడా మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆయన రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ విడుదల తేదీపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది, 2027 ఏప్రిల్ 7వ తేదీని రాజమౌళి లాక్ చేయడం వెనుక ఒక భారీ స్కెచ్ ఉందనేది స్పష్టమవుతోంది. సాధారణంగా దేవుడిని నమ్మనని చెప్పే రాజమౌళి, బాక్సాఫీస్ వద్ద పండుగలను మాత్రం గట్టిగా నమ్ముకుంటారు. ఏప్రిల్ 7న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం వెనుక కేవలం సమ్మర్ సీజన్ మాత్రమే కాదు, వరుస సెలవుల జాతర కూడా ఉంది. ఈ తేదీని ఎంపిక చేయడం ద్వారా దాదాపు రెండు వారాల పాటు తిరుగులేని వసూళ్ల వేటను ఆయన ప్లాన్ చేశారు.
Also Read :Shocking: అక్రమ సంబంధం.. మామపై పెట్రోల్ పోసి నిప్పటించిన కోడలి ప్రియుడు..
ఏప్రిల్ 7న మనకు ఉగాది కాగా, మహారాష్ట్రలో ‘గుడి పడ్వా’గా నూతన సంవత్సరాదిని జరుపుకుంటారు. రాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగొచ్చిన ఈ పవిత్ర దినాన సినిమాను రిలీజ్ చేయడం ద్వారా నార్త్ ఇండియాలో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, మరుసటి రోజు ఏప్రిల్ 15న శ్రీరామనవమి. ఇలా మొదటి వారం నుంచే సెలవుల సందడి మొదలవుతుంది. అలానే ఏప్రిల్ 18 ఆదివారం హనుమాన్ జయంతి కాగా, మరుసటి సోమవారం ఏప్రిల్ 19న మహావీర్ జయంతి. అంటే సినిమా విడుదలైన రెండో వారంలో కూడా వరుసగా లాంగ్ వీకెండ్స్ దొరుకుతున్నాయి.
Also Read :Shruti Haasan : విడాకులు నాకు జీవిత పాఠం నేర్పాయి.. శృతి హాసన్
కేఎల్ నారాయణ నిర్మాణంలో, కీరవాణి సంగీత సారథ్యంలో వస్తున్న ఈ చిత్రం బడ్జెట్ అక్షరాలా 1000 నుంచి 1300 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి చిత్రీకరణను పూర్తి చేసి, మిగిలిన సమయాన్ని విజువల్ ఎఫెక్ట్స్ మరియు ప్రమోషన్ల కోసం కేటాయించనున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ‘పాన్ వరల్డ్’ సినిమాగా దీనిని రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. సమ్మర్ వెకేషన్, వరుస పండుగలు, దేశవ్యాప్త సెలవులు.. ఇలా అన్నిటినీ లెక్కగట్టి రాజమౌళి ఈ డేట్‌ను ఫిక్స్ చేశారు. ముందే ‘కర్చీఫ్’ వేసిన ఈ తేదీతో బాక్సాఫీస్ రికార్డులన్నీ మహేశ్ బాబు ఖాతాలో చేరడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
