Site icon NTV Telugu

SS Rajamouli: ఆ సమయంలో చాలా బాధేసింది.. రాజమౌళి ఆవేదన

Rajamouli On Rrr Oscars

Rajamouli On Rrr Oscars

SS Rajamouli Reacts on RRR Losing India Oscar Entry: విశ్వవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన ఆదరణను చూసి.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తప్పకుండా ఆ సినిమాను ఆస్కార్‌కు నామినేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా ఛెల్లో షో (ద లాస్ట్ ఫిల్మ్ షో)ని ఎంపిక చేయడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. దర్శకధీరుడు రాజమౌళి మాత్రం ఈ వ్యవహారంపై ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా రెస్పాండ్ అయ్యాడు. భారతదేశం తరఫున ఆర్ఆర్ఆర్ చిత్రానికి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ లభించకపోవడం పట్ల తాను నిరాశచెందానని, ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని జక్కన్న ఆవేదన వ్యక్తం చేశారు.

Man dragged on car: అమానుషం.. వ్యక్తిని కారుతో ఈడ్చుకెళ్లిన మహిళ

ఒకవేళ ఆస్కార్ అవార్డులకు గాను ఆర్ఆర్ఆర్‌కి అధికారికంగా ఎంట్రీ ఇచ్చి ఉంటే, చాలా బాగుండేదని జక్కన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. విదేశీయులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఏంటి? అది ఎలా వర్క్ చేస్తుంది? ఏ ప్రాతిపదికన ఓ సినిమాని ఆస్కార్‌కు ఎంపిక చేస్తారు? అనే విషయాలపై తనకు సరైన అవగాహన లేకపోవడం వల్ల.. దాని గురించి ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. తమ సినిమాకు ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీ దక్కకపోవడం గురించి ఎక్కువగా ఆలోచించలేదని, ముందడుగు వేయాలనుకొని తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టామని చెప్పాడు. ‘ద లాస్ట్ ఫిల్మ్ షో’కు ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని జక్కన్న పేర్కొన్నాడు.

John Abraham: చేయని తప్పుకి శిక్ష.. జాన్ అబ్రహంపై విమర్శలు

కాగా.. భారత్ నుండి ఆర్ఆర్ఆర్‌కి ఆస్కార్ ఎంట్రీ దక్కకపోవడంతో, జక్కన్న అంతర్జాతీయ స్థాయి ప్రమోషనల్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుని, నేరుగా తన చిత్రాన్ని ఆస్కార్‌కి నామినేట్ అయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అందులో భాగంగానే గోల్డెన్ గ్లోబ్‌తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు ఆర్ఆర్ఆర్‌కి దక్కాయి. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్‌పై ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులు చాలా ఆసక్తిగా ఉన్నారు. జనవరి 24వ తేదీన ఈ ఆస్కార్ నామినేషన్స్‌ను ప్రకటిస్తారు. ఉత్తమ దర్శకుడు కేటగిరీలో జక్కన్నకు చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ‘లాస్ ఏంజెలిస్ట్ టైమ్స్’ నిర్వహించిన ఓ సర్వే తేల్చడంతో.. ఈ నామినేషన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Greater Noida: యువతిపై సామూహిక అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

Exit mobile version