Site icon NTV Telugu

బాలయ్య బాబు ఒక ఆటంబాంబ్ – ఎస్.ఎస్ రాజమౌళి

ssrajamouli

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరుకాగా రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ” అఖండ చిత్రంతో మళ్లీ థియేటర్లను ఓపెన్ చేయించినందుకు బోయపాటి గారికి థాంక్స్. డిసెంబర్ 2 నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్ గా మళ్లీ థియేటర్లు ఇంత అరుపులు, కేకలతో ఉంటాయి. ఇక్కడ కూర్చున్న మాకు ఎంత ఆనందం వస్తుందో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులకు కూడా అంతే ఆనందం వస్తుందని కోరుకుంటున్నాను. బాలయ్య బాబు ఒక ఆటంబాంబ్.. ఆ ఆటంబాంబ్ ను ఎలా ప్రయోగించాలో శ్రీనుగారికి మాత్రమే తెలుసు.. బాలయ్యగారి ఎనర్జీ సీక్రెట్ తెలుసుకోవాలని ఉంది.. ఇప్పుడు చూసింది కేవలం మచ్చుతునక.. సినిమా ఇంకా అదిరిపోతోంది. నేను ఫస్ట్ డే ఫస్ట్ షో కి వెళ్తా.. అఖండ పెద్ద హిట్ అవ్వాలి. మళ్లీ ఈ సినిమా మా ఇండస్ట్రీకి కొత్త ఊపును తీసుకురావాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

https://www.youtube.com/watch?v=-nxnOE-_TVI
Exit mobile version