Bigg boss 6: ఆ ఇద్దరి విషయంలో బిగ్‌బాస్ యూటర్న్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 ఐదోవారం నామినేషన్స్‌లో రసవత్తర ఘట్టానికి తెర లేపారు. ఈ వారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ హౌస్‌లోని ఇద్దరేసి కంటెస్టెంట్స్ ను గార్డెన్ ఏరియాలోకి పిలిచి వారిలో ‘ఎవరు నామినేట్ కావాలి, ఎవరు సేఫ్ జోన్ లో ఉండాలి’ అనేది వారినే తేల్చుకోమని చెప్పారు. చిత్రం ఏమంటే… హౌస్‌లో నాలుగు వారాలుగా బాగా క్లోజ్‌గా మూవ్ అవుతున్న ఇద్దరేసి కంటెస్టెంట్లను ఒకేసారి బిగ్ బాస్ పిలవడం మొదలెట్టాడు. దాంతో ఇంతకాలం ఫ్రెండ్స్ కోసం సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోయింది.
Read Also: Chiranjeevi: మల్కాజిగిరి ఎంపీగా ఉపాసన.. చిరు ఏమన్నారంటే..?
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
భార్యాభర్తలైన రోహిత్, మెరీనా ను ఇంతవరకూ బిగ్ బాస్ సింగిల్ కంటెస్టెంట్ గా ట్రీట్ చేశాడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ యూ టర్న్ తీసుకున్నాడు. ఇక నుండి వీరిద్దరినీ వేర్వేరు కంటెస్టెంట్స్ గా గుర్తిస్తామని ప్రకటించాడు. అంతేకాదు… సోమవారం నామినేషన్ ప్రక్రియలో మొదట ఈ జోడినే పిలిచి, ఎవరు నామినేట్ కావాలనుకుంటున్నారో, ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారో తేల్చుకోమని చెప్పాడు. ఇంతవరకూ రోహిత్ ను గైడ్ చేస్తూ వచ్చిన మెరీనా… ఇక్కడ కూడా అతన్నే సేఫ్ జోన్ లోకి నెట్టి, తాను నామినేషన్ ను స్వీకరించింది. ఆ తర్వాత ఇనయా, శ్రీహాన్ జోడీలో ఇనయా; వాసంతి, సుదీపలో వాసంతి; అర్జున్, శ్రీసత్యలో అర్జున్; ఆదిరెడ్డి, రేవంత్ లో ఆదిరెడ్డి; ఫైమా, సూర్యలో ఫైమా; బాలాదిత్య, రాజ్ లో బాలాదిత్య; చలాకీ చంటి, గీతూలో చంటీ రిస్క్ తీసుకుని నామినేషన్స్ ను స్వీకరించారు. అలా ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ కీర్తి భట్ ను పక్కన పెడితే, మెరీనా, ఇనయా, వాసంతి, అర్జున్, ఆదిరెడ్డి, ఫైమా, బాలాదిత్య, చలాకీ చంటీ నామినేట్ అయ్యారు. మరి ఈ మధ్యలో బిగ్ బాస్ వేరే ఏమీ మెలికలు, మలుపులు పెట్టకపోతే… వీరిలో ఎవరెవరికి ప్రేక్షకుల మద్దత్తు లభిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!