Sri Satya Father Srinivasa Prasad Revealed Shocking Secrets: బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన కొత్తలో పెద్దగా గేమ్ ఆడని సత్య.. ఆ తర్వాత నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో గేమ్ మీద ఫోకస్ పెట్టింది. తనదైన ఆటతీరుతో హౌస్‌లో నెట్టుకొస్తోంది. అయితే.. క్రమంగా ఆమె అర్జున్ కళ్యాణ్‌తో క్లోజ్ అవుతూ రావడంతో, ఇద్దరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలపై తాజాగా శ్రీసత్య తండ్రి శ్రీనివాస ప్రసాద్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. శ్రీసత్య, అర్జున్‌లది కేవలం స్నేహం మాత్రమేనని, కొన్ని ఛానెళ్లు వారి ఫ్రెండ్‌షిప్‌ను వక్రీకరించి మాట్లాడాయని, అది చూసి తన భార్య ఏడ్చేసిందని అన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు శ్రీసత్య లైఫ్ గురించి పిచ్చిపిచ్చి రాస్తున్నాయని, ఏది పడితో అది రాస్తే తాను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు.
ఇదే సమయంలో శ్రీనివాస ప్రసాద్ తన కూతురి గురించి మరిన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. శ్రీసత్య నిశ్చితార్థం అయిన తర్వాత అబ్బాయి మంచివాడు కాదని తెలిసి పెళ్లి క్యాన్సిల్ చేశామన్నారు. అప్పుడు శ్రీసత్య తన చేతి మణికట్టు కోసుకోవడంతో పాటు ఫ్యాన్‌కి ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని తెలిపారు. కళ్ల ముందే కూతురు వేలాడటం చూసి తన భార్య తల్లడిల్లిపోయిందని, ఎలాగోలా తమ కూతుర్ని కాపాడుకోగలిగామని చెప్పారు. అయితే.. రెండు, మూడు రోజులకే తన భార్యకి గుండెపోటు వచ్చిందని, అప్పుడు కొవిడ్ టైమ్ కావడంతో ఏ ఒక్కరూ ఆసుపత్రిలో చేర్పించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ చేర్పించుకొని ఉంటే, రూ. 25 వేలతోనే అయిపోయేదన్నారు. ఆ తర్వాతి రోజు తీసుకెళ్తే.. మెదడులో నరాలు పగిలాయని, ఆపరేషన్‌కు రూ. 40 లక్షలు అడిగారన్నారు. ఆపరేషన్ అయ్యాక తన భార్యకు పక్షవాతం వచ్చిందన్నారు.
ఇప్పుడు తన భార్య మెల్లమెల్లగా కోలుకుందని, రెండున్నర సంవత్సరాల తర్వాత ఆమె నోటి నుంచి సత్య అనే పిలుపు వచ్చిందని శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. తన భార్య పక్షవాతం బారిన పడినప్పుడు శ్రీసత్య ఎంతో ఖర్చు పెట్టిందని, ఇప్పటిదాకా రూ.75 లక్షలు ఖర్చు చేసిందని చెప్పారు. ఒక్కో నెలకు తన భార్యకు రూ. 2 లక్షల దాకా ఖర్చు అవుతోందని, అవన్నీ తన కూతురే పెట్టుకుంటోందని అన్నారు. మొదట్లో తాను బిగ్‌బాస్‌కి వెళ్లొద్దని శ్రీసత్యకు చెప్పానని.. కానీ కేరళలో తన భార్య వైద్యం కోసం రూ. 6 లక్షలు అడగడంతో బిగ్‌బాస్‌కు వెళ్లాల్సిందేనని శ్రీసత్య నిర్ణయించుకొని, ఆ రియాలిటీ షోకి వెళ్లిందని చెప్పుకొచ్చారు.