మెగాస్టార్ చిరంజీవి ప్రెజంట్ చేస్తున్నభోళా శంకర్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే.భోళా శంకర్ సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఆ సినిమా తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా కోసం శర వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు ను దక్కించుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో చిరంజీవి సినిమా ప్రారంభం కాబోతుందని సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి,కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా లో మరో హీరో గా సిద్దు జొన్నలగడ్డ కనిపించబోతున్నాడని సమాచారం.చిరంజీవి కొడుకు పాత్ర లో సిద్దు జొన్నలగడ్డ కనిపించబోతున్నాడు అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. చిరంజీవికి జోడీగా త్రిష నటించబోతుండగా సిద్దు జొన్నలగడ్డ కు జోడీగా శ్రీ లీల నటించబోతున్నట్లు తెలుస్తుంది.భారీ అంచనాల మధ్య రూపొందబోతున్న ఈ సినిమా లో నటించేందుకు గాను శ్రీలీల ఏకం గా 1.50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు గా సమాచారం.. ఈ సినిమా ను చిరంజీవి పెద్ద కూతురు అయిన సుస్మిత కొణిదెల నిర్మించబోతుంది. భారీ బడ్జెట్ తో తండ్రి హీరోగా ఈ సినిమా రూపొందించబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా వున్నాయి.. భారీ అంచనాల తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఆగస్టు లో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ లో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.చిరంజీవి సినిమా లో నటించే అవకాశం రావడమే ఎంతో గొప్ప విషయం. అలాంటిది ఏకంగా శ్రీ లీల కి ఆయన కోడలిగా నటించబోతుంది.. పైగా కోటిన్నర పారితోషికం కూడా అందుకోబోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల లిస్ట్ చాలానే ఉంది.