తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకుంది శ్రీలీల..ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఏకంగా పది సినిమాలకు పైగానే నటిస్తూ ఇప్పుడు ఇండస్ట్రిలో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారింది.. కాగా ఇలాంటి క్రమంలోనే శ్రీ లీల తన క్రేజ్ ని ఇంకా పెంచుకోవడానికి టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండతో ముద్దు సన్నివేశాలలో నటించడానికి సిద్ధమయినట్లు సమాచారం. గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తుంది.. కాగా ఈ సినిమాలో కధకు అనుగుణంగా హీరోయిన్ శ్రీలీల -హీరో విజయ్ దేవరకొండ తో ముద్దు సీన్ చేయాల్సి ఉంటుందట. అయితే ఏ హీరో సినిమా ఆయినా సరే కండిషన్స్ పెట్టే శ్రీలీల..ఈ హీరోతో మాత్రం అసలు కండిషన్స్ పెట్టలేదని సమాచారం.ఆ ముద్దు సీన్స్ లో నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. శ్రీలీల లాగానే చాలా మంది హీరోయిన్స్ విజయ్ దేవరకొండ తో ముద్దు సీన్స్ లో నటించాలని ఉంది అని బహిరంగంగానే చెప్పుకొచ్చారు.దీంతో హీరోయిన్స్ అందరికి విజయ్ దేవరకొండ అంటే పిచ్చ క్రేజ్ అని అర్ధమవుతుంది.విజయ్ ఆటిట్యూడ్ ఆయన స్టైల్ హీరోయిన్స్ లో క్రేజ్ వచ్చేలా చేసింది.విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా తో ఎంతో బిజీ గా వున్నాడు.ఎంతో కష్టపడి చేసిన లైగర్ సినిమా డిజాస్టర్ కావడం తో నిరాశ చెందిన ఈ రౌడీ హీరో ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన సాంగ్స్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది. మరీ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుందని సమాచారం.