బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర బంపర్ ఆఫర్ అందుకున్నాడు. ఈ బిగ్ బాస్ సీజన్ 5 లో విన్నర్ గా శ్రీరామచంద్ర నిలుస్తాడని అందరు అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సన్నీ విజేతగా, షన్ను రన్నర్ గా నిలవగా మూడో స్థానాన్ని శ్రీరామ్ అందుకున్నాడు. ఇక బయటికి వచ్చాక శ్రీరామ్ ‘ఆహా’ నుంచి మంచి ఆఫర్ ని అందుకున్నాడు. త్వరలో ఆహాలో ప్రారంభం కానున్న ‘ఇండియన్ ఐడల్’ కి హోస్ట్ గా శ్రీరామ చంద్రను ఎంపిక చేశారు. తాజాగా ఆహా మేకర్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
ఇకపోతే శ్రీరామ చంద్ర 2013లో ఇండియన్ ఐడల్ గా విన్ అయినా సంగతి తెలిసిందే. ఇక ఇటీవల బిగ్ బాస్ లో శ్రీరామ్ చంద్ర నిజాయితీకి మారుపేరుగా నిలిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దీంతో ప్రేక్షకులందరూ ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవ్వనుందా..? అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆడిషన్స్ జరుపుకుంటున్న ఈ సంగీత కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుంది. మరి సింగర్ గా అలరించిన శ్రీరామచంద్ర హోస్ట్ గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.
