AK 47: చిట్టిబాబుకు జోడీగా శ్రీనిధి శెట్టి.. స్వర్ణ పాత్రలో ఆకట్టుకుంటున్న గ్లింప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AK 47: ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వెంకటేష్ పోషిస్తున్న చిట్టిబాబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ మంచి స్పందన అందుకోగా, ఇప్పుడు చిత్ర బృందం మరో కీలక పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమాలో కథానాయిక శ్రీనిధి శెట్టి పోషిస్తున్న ‘స్వర్ణ’ పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో శ్రీనిధి శెట్టి మధ్యతరగతి ఇల్లాలిగా కనిపించారు. చిట్టిబాబుకు భార్యగా, కుటుంబానికి అండగా నిలిచే స్వర్ణ పాత్ర సినిమాలో కూడా గట్టిగానే నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. చిరునవ్వుతో కుటుంబాన్ని ముందుకు నడిపించే మహిళగా ఆమె పాత్రను తీర్చిదిద్దినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. చిట్టిబాబు, స్వర్ణ మధ్య ఉండే అనుబంధం, చిలిపి మాటలు, చిన్న చిన్న సరదా సంఘటనలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
కొత్తగా విడుదలైన ఈ వీడియోలో వెంకటేష్ తన భార్య స్వర్ణ గురించి సరదాగా చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఆడదానికి యాటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదని, అదేసమయంలో నివేదా పేతురాజ్ నవ్వుతూ కనిపించే సన్నివేశాన్ని, వెంకటేష్ తన భార్య స్వర్ణతో పోల్చే సన్నివేశాలు సరదాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చిట్టిబాబు పాత్ర పరిచయం ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు స్వర్ణ పాత్రతో సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు మరింత ప్రాధాన్యం ఉండబోతుందని స్పష్టమైంది. త్వరలోనే ఈ కుటుంబంలోని మరో ఇద్దరు కీలక పాత్రలైన యువినా పార్థవి పోషిస్తున్న ‘సంపూర్ణ’, రాజా ప్రజ్వల్ పోషిస్తున్న ‘సర్వ’ పాత్రల గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అయితే చిట్టిబాబు–స్వర్ణల దాంపత్య జీవితాన్ని కామెడీగా చూపించడమే సినిమాకు హైలెట్ గా ఉండొచ్చనేది గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
ఈ మూవీలో రావు రమేష్, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ ఎస్. సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లతో మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?