NTV Telugu Site icon

Sreemukhi: ఇది దారుణం.. తండ్రితోనే శ్రీముఖి పెళ్లి?

Sreemukhi Marriage Rumours

Sreemukhi Marriage Rumours

Sreemukhi Reacts On Her Marriage Rumours: గ్లామర్ ఇండస్ట్రీకి చెందిన తారలపై డేటింగ్ & పెళ్లి రూమర్లు రావడం సార్వసాధారణమే! మరీ ముఖ్యంగా.. వాళ్లు ఎవరితోనైనా కాస్త సఖ్యతగా మెలిగితే చాలు, వారి మధ్య లింక్ పెట్టేస్తారు. అక్కడ ఎలాంటి పప్పులు ఉడకకపోయినా, ఇక్కడ మాత్రం కథనాలు అల్లేస్తారు. ఏమైనా మాట్లాడితే.. ‘నిప్పు లేనిదే పొగ రాదుగా’ అంటూ లాజిక్‌లతో కౌంటర్లు ఇచ్చేస్తారు. ఇక్కడవరకూ బాగానే ఉంది కానీ.. కొందరు గాసిప్‌రాయుళ్లైతే హద్దుమీరి పుకార్లు సృష్టిస్తుంటారు. ఎలాంటి నిప్పు లేకపోయినప్పటికీ, పొగ పుట్టించేస్తారు.

Mekapati Chandrasekhar Reddy: శివచరణ్ నా కొడుకే కాదన్న ఉదయగిరి ఎమ్మెల్యే

ఇప్పుడు యాంకర్ కమ్ నటి శ్రీముఖి విషయంలో కూడా అదే జరిగింది. ఈ అమ్మడు పెళ్లికి సిద్ధమవుతోందంటూ పెద్ద ప్రచారానికి తెరలెపేశారు. హైదరాబాద్‌కి చెందిన ఒక వ్యాపారవేత్తతో ఈ అమ్మడు ఏడడుగులు వేయబోతోందని ఆ ప్రచారం సారాంశం. త్వరలోనే ఈ భామ అధికారికంగానే తన పెళ్లి విషయాన్ని వెల్లడిస్తుందని కూడా కథనాలు రాసేశారు. గతంలోనూ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు, అందులో వాస్తవం లేదని శ్రీముఖి ఖండించింది. ఇప్పుడు తనకు తెలియకుండానే పెళ్లి ఫిక్స్ చేయడంతో, ఈసారి మరింత ఘాటుగా స్పందించింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. గాసిప్‌రాయుళ్లకి ఆ వ్యాపారవేత్త ఎవరో తెలీదు కాబట్టి, తండ్రితో శ్రీముఖి కలిసి ఉన్న ఫోటోలను థంబ్‌నైల్స్‌పై పెట్టి, తండ్రి ముఖాన్ని బ్లర్ చేశారు. ఇదే శ్రీముఖికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది.

Waltair Veerayya Trailer: వాల్తేరు వీరయ్య ట్రైలర్.. నిజంగా పూనకాలే!

ఈ వార్తలపై శ్రీముఖి స్పందిస్తూ.. ‘‘నాకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇక్కడ దారుణమైన విషయం ఏమిటంటే.. నా తండ్రి ఫోటోని బ్లర్ చేసి, అతడినే పెళ్లి చేసుకోబోతోందని థంబ్‌నైల్స్ పెడుతున్నారు. ఇది చాలా ఘోరం. ఈ రూమర్లు వినీవినీ నేను అలసిపోయా. ఇంకా నాకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారో ఏమో’’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఆ సమయం వస్తే తానే స్వయంగా వెల్లడిస్తానని స్పష్టం చేసింది.ఈలోపు ఇలాంటి చెత్త న్యూస్‌లు రాయొద్దంటూ హెచ్చరించింది.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య టైటిల్.. బాబీ చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ