Waltair Veerayya: వాల్తేరు వీరయ్య టైటిల్.. బాబీ చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Bobby Reveals Interesting Story Behind Waltair Veerayya Title: సినిమాలకు ‘టైటిల్’ అనేది ఎంతో ముఖ్యమైందో అందరికీ తెలుసు. ఒక సినిమా మొత్తం దాని మీదే ఆధారపడి ఉంటుంది. సినిమాపై క్యూరియాసిటీ పెరగాలన్నా, ప్రేక్షకులు ఆ సినిమా పట్ల ఆకర్షితులు అవ్వాలన్నా.. ఈ టైటిలే కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. ఫిల్మ్‌మేకర్స్ ఎంతో కసరత్తు చేసి తమ సినిమాకు సరిగ్గా సూటయ్యేలా, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఏరికోరి మరీ ఆసక్తికరమైన టైటిల్స్‌నే ఎంపిక చేస్తారు. కొన్ని సినిమాలకైతే.. ఈ టైటిల్సే పునాదులు వేస్తాయి. అలాంటి సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటని దర్శకుడు బాబీ తన ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పుకొచ్చాడు. తాను స్టోరీ రాసుకొని ఈ టైటిల్ ఫిక్స్ చేయలేదని, టైటిల్ ఆధారంగా స్టోరీ రాసుకున్నానంటూ.. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకొచ్చాడు.
Waltair Veerayya Trailer: వాల్తేరు వీరయ్య ట్రైలర్.. నిజంగా పూనకాలే!
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. ‘‘యాగంటిలో వెంకీ మామ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో.. నటుడు నాజర్ నాకు ఒక పుస్తకం ఇచ్చారు. అది చదువుతున్నప్పుడు, అందులోని ‘వీరయ్య’ అనే పేరు నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ ‘వీరయ్య’ అనే టైటిల్‌తో సినిమా చేయాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నా. ఈ విషయం మా టీం సభ్యులకు కూడా చెప్పాను. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి ఇంకా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు బాపట్లలో ఉన్నప్పుడు, చిరు నాన్న వద్ద పని చేసే ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి, చిరుతో ఫోటోషూట్ చేయించారు. ఆ ఫోటోల వల్లే తాను మద్రాస్ వచ్చానని చిరంజీవి చెప్పారు. చిరుకి సహాయం చేసిన ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్యనే. సో.. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలా వాల్తేరు వీరయ్య స్టోరీ పుట్టుకొచ్చింది. ఇది చిరంజీవికి కూడా బాగా నచ్చింది’’ అని వివరించాడు. ఇదన్నమాట ఈ టైటిల్ వెనకున్న అసలు సంగతి!
Constable Love Affair : ఫ్రెండ్ షిప్.. లవ్.. రూమ్.. ప్రెగ్నెంట్ కాగానే ప్లాన్ రివర్స్
కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటించాడు. శృతిహాసన్ కథానాయికగా నటించగా, కేథరిన్ తెరిసా కూడా ఇందులో మెరిసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్స్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడంతో.. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మరి, జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!