Site icon NTV Telugu

Vishnu Vinyasam : మిక్స్డ్ టాక్’తో 3 రోజుల్లో 14.7 కోట్లు కొల్లగొట్టిన శ్రీ విష్ణు

Vishnu Vinyasam

Vishnu Vinyasam

శ్రీ విష్ణు తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది, ఆడియన్స్ ఆదరణతో ఈ చిత్రం మొదటి వీకెండ్‌లోనే భారీ వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మిక్స్డ్ టాక్’తో కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 14.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. శ్రీ విష్ణు కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమనిపిస్తోంది. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు తెరకెక్కించిన ‘విష్ణు విన్యాసం’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజు ఆశించిన స్థాయిలోనే ఓపెనింగ్స్ రాగా, రెండు, మూడవ రోజుల్లో వసూళ్ల గ్రాఫ్ అమాంతం పెరగడం గమనార్హం.

Also Read :Sampradayini Suppini Suddapoosani: నవ్విస్తూనే ఆసక్తి పెంచేసిన ట్రైలర్

జ్యోతిష్యం, న్యూమరాలజీ చుట్టూ తిరిగే కథను దర్శకుడు చాలా వినోదాత్మకంగా మలిచారు. యువతకు శ్రీ విష్ణు మార్క్ కామెడీ నచ్చుతుండగా, ఫ్యామిలీ ఆడియన్స్ క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సత్య, శ్రీ విష్ణుల మధ్య వచ్చే కామెడీ సీన్స్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభమైనప్పటికీ, ‘బుక్ మై షో’ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఆశాజనకంగా ఉన్నాయి. బి, సి సెంటర్లలో కూడా ఫుట్‌ఫాల్స్ నిలకడగా ఉండటం గమనార్హం. శ్రీ సబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.

Exit mobile version