Site icon NTV Telugu

Spirit Movie Update: ప్రభాస్ స్పిరిట్ లో మలయాళ బ్యూటీ..!

Prabas Spirit

Prabas Spirit

గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. రాజాసాబ్, ఫౌజీ సినిమాల పనులను పూర్తి చేస్తున్న ఆయన, అతి త్వరలో రాజాసాబ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ సృష్టించాయి. ప్రభాస్ మరో మోస్ట్-ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’‌ను యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, సినిమా నవంబర్ 5 నుంచి అధికారికంగా షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రభాస్ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. సినిమా థ్రిల్లర్, యాక్షన్, డ్రామా, ఎమోషన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని దర్శకుడు హైలైట్ చేస్తున్నారు. అయితే

Also Read : Anupama : నటి కాలేనని అనుకున్నా.. చివరికి నిజం తెలిసింది” – అనుపమ పరమేశ్వరన్

ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి త్రుప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించనున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఇప్పటి వరకు అందుతున్న లీక్‌లు ప్రకారం, మరో మలయాళ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ను కూడా చేర్చారట. ఈ పాత్రకు మొదట బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు, కానీ చివరికి మడోన్నా ఫైనల్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆమె సెకండ్ హీరోయిన్నా లేదా ప్రతినాయక పాత్రలో నటించబోతుందో అధికారికంగా తెలియాల్సి ఉంది.

మడోన్నా తన సినీ ప్రయాణాన్ని మలయాళం‌లో ‘ప్రేమమ్’తో ప్రారంభించారు. తర్వాత తమిళ, తెలుగు రీమేక్‌లలోనూ నటించారు. ప్రత్యేకంగా తెలుగులో ప్రేమమ్ రీమేక్‌లో నాగచైతన్య సరసన నటించారు. శ్యామ్ సింగరాయ్ లో లీడ్ రోల్‌ చేసిన ఆమె, ఇప్పుడు ప్రభాస్ సరసన స్పిరిట్ లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటున్నారట. ప్రభాస్ స్పిరిట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి, మడోన్నా చేరడం ఆమె కెరీర్‌లో మైలురాయిగా మారవచ్చు.

Exit mobile version