Anupama : నటి కాలేనని అనుకున్నా.. చివరికి నిజం తెలిసింది” – అనుపమ పరమేశ్వరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన అమాయకమైన చిరునవ్వు, అందమైన కళ్ళతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. మలయాళ సినిమా ప్రేమమ్ తో సెన్సేషన్ సృష్టించి, అక్కడి నుంచి నేరుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తన సహజమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి సినిమాలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు రెండింట్లోనూ సమానంగా రాణిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న అనుపమ, టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ కలిగిన నటిగా నిలిచింది. ఇటీవల కిష్కింధపురితో విజయం సాధించింది. ఇక త్వరలో బైసన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ చిన్నతనంలో మనసులో నాటుకుపోయిన మాటలు, కలలపై ఎంత ప్రభావం చూపుతాయో చెడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
అనుపమ మాట్లాడుతూ.. ‘నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ మా స్కూల్‌లో టాపర్స్‌కి మాత్రమే యాక్టింగ్‌లో అవకాశమిస్తారన్నది అనే వారు. ఎందుకంటే బాగా చదివే వాళ్లు.. పెద్ద పెద్ద డైలాగులు నేర్చుకో గలుగుతారు.. గుర్తు పెట్టుకుని చెప్పగలుగుతారు అనేవాళ్లు. ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. నేనెలాగూ స్కూల్ టాపర్‌ను కాదు కాబట్టి ఇక నటిని అవ్వలేనని భయం పడిపోయింది. అలా నటి కావాలన్న నా కలను పూర్తిగా పక్కకు పెట్టేశా. కానీ నాకు కొంచెం ఊహ తెలిశాకే చదువుకు.. నటనకు ఏ సంబంధం లేదని అర్థం అయింది. మేము చదువుని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తామోనన్న ఉద్దేశంతో స్కూల్‌లో అలా చెప్పేవారని తెలుసుకున్నా’’ అని చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంది అనుపమ.
Also Read
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
- Trivikram Srinivas: 'ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం' వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
తాజావార్తలు
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?