Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spirit Controversy: ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ చుట్టూ మరోసారి వివాదం రాజుకుంది. ఈ సినిమా నుంచి తన నిష్క్రమణపై వంగా బ్రదర్స్ చేసిన ఆరోపణలకు నటి దీపికా పదుకొణె నేరుగా స్పందించకపోయినా.. సోషల్ మీడియాలో చేసిన ఒక్క పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తనపై వచ్చిన విమర్శలకు మద్దతుగా ఉన్న ఒక జర్నలిస్ట్ పోస్ట్‌ను దీపికా లైక్ చేయడంతో.. ఆమె పరోక్షంగా తన వైఖరిని వెల్లడించారనే చర్చ మొదలైంది.
దీపికాపై వంగా బ్రదర్స్ సంచలన ఆరోపణలు
‘స్పిరిట్’ నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం గతంలోనే సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల సందీప్ రెడ్డి సోదరుడు, చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీపికా సినిమా నికర లాభాల్లో 10 శాతం ప్రాఫిట్ షేర్ కోరారని, అలాగే షూటింగ్ సమయంలో రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానని నిబంధన పెట్టారని ఆయన ఆరోపించినట్లు సమాచారం.
Also Read
- Scene Movie: "హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది": సూర్య
- Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
- Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
- Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
అంతేకాకుండా సినిమా కథ, పాత్రకు సంబంధించిన కొన్ని అంతర్గత విషయాలను ఆమె తన పీఆర్ టీమ్ ద్వారా మీడియాకు లీక్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ డిమాండ్లు, వ్యవహారశైలి కారణంగానే ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించాల్సి వచ్చిందని వంగా బ్రదర్స్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ఒక్క లైక్‌తో దీపికా సమాధానం?
ఈ ఆరోపణలపై దీపికా ఇప్పటివరకు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించలేదు. అలాగే తన సోషల్ మీడియా ఖాతాల్లో నేరుగా వివరణ కూడా ఇవ్వలేదు. అయితే ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన సుదీర్ఘ పోస్టుకు ఆమె లైక్ చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
ఆ పోస్టులో ఒక మహిళా స్టార్ తన సినిమాకు తగిన పారితోషికం లేదా లాభాల్లో వాటా కోరడం తప్పు కాదని పేర్కొన్నారు. అలాగే తన పని గంటల విషయంలో షరతులు పెట్టుకోవడం కూడా ఒక నటిగా ఆమె హక్కేనని అభిప్రాయపడ్డారు. పురుష హీరోలు భారీ రెమ్యునరేషన్, ప్రాఫిట్ షేర్, ప్రత్యేక పని గంటలు కోరినప్పుడు వాటిని స్టార్ పవర్ లేదా బిజినెస్ డిసిషన్గా చూడటం, అదే మహిళా స్టార్ విషయంలో మాత్రం అహంకారం లేదా నమ్మకద్రోహంగా చిత్రీకరించడం డబుల్ స్టాండర్డ్ అంటూ ఆ పోస్ట్‌లో విమర్శించారు.
ఇండస్ట్రీలో లింగ వివక్షపై చర్చ
దీపికా లైక్ చేసినట్లు చెబుతున్న ఆ పోస్టులో ప్రధానంగా సినిమా పరిశ్రమలో మహిళా నటుల విషయంలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించారు. అగ్ర హీరోలు తమ మార్కెట్‌కు అనుగుణంగా భారీ పారితోషికాలు, లాభాల్లో వాటాలు లేదా పని విషయంలో ప్రత్యేక నిబంధనలు కోరితే సాధారణంగా వాటిని వ్యాపార పరమైన నిర్ణయాలుగా చూస్తారని.. అదే హక్కులను ఒక మహిళా స్టార్ కోరినప్పుడు మాత్రం ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమవుతోంది. దీపికా నేరుగా ఎలాంటి ఆరోపణ చేయకపోయినా, ఆ పోస్టుకు ఆమె ఇచ్చిన లైక్‌ను తనపై వచ్చిన వ్యాఖ్యలకు పరోక్ష సమాధానంగా పలువురు భావిస్తున్నారు. అయితే ఆ లైక్‌ను అధికారిక ప్రకటనగా పరిగణించలేం.
త్రిప్తి డిమ్రీకి వెళ్లిన ఛాన్స్
ఇదిలా ఉంటే.. ‘స్పిరిట్’లో దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా ఎంపికైనట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది.
దీపికా నిష్క్రమణ, వంగా ఆరోపణలు, ఆమె సోషల్ మీడియా రియాక్షన్‌గా భావిస్తున్న ఈ లైక్.. ఇలా వరుస పరిణామాలతో ‘స్పిరిట్’ సినిమా కంటే ముందే ఈ ప్రాజెక్ట్ చుట్టూ వివాదాలు ఆసక్తిని పెంచుతున్నాయి. మరి సినిమా విడుదల సమయానికి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!