భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినవి పద్మ అవార్డులు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర విజ్ఞానం, వాణిజ్యం, విద్య, వైద్యం, సాహిత్యం , క్రీడలు వంటి వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారాలు, దేశాభివృద్ధిలో భాగస్వాములైన నిస్వార్థ వ్యక్తులకు గుర్తింపునిస్తాయి.
Pakistan T20 World Cup: దాయాదుల మధ్య పోరుకు ఈ రోజు పాకిస్థాన్లో హైప్రొఫైల్ మీటింగ్..
పద్మ అవార్డులు ప్రధానంగా మూడు విభాగాలు
ఎంపిక ప్రక్రియ , నామినేషన్లు
అవార్డు గ్రహీతలకు లభించే సౌకర్యాలు , గౌరవాలు
అవార్డు వినియోగంపై ఉన్న ఆంక్షలు
పద్మ అవార్డు అనేది ఒక బిరుదు కాదు, అది ఒక గుర్తింపు మాత్రమే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం, ఈ అవార్డు గ్రహీతలు తమ పేరుకు ముందు లేదా వెనుక (Suffix or Prefix) ఈ అవార్డు పేరును ఉపయోగించకూడదు. అంటే విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్లు లేదా పుస్తకాలపై ‘పద్మశ్రీ ఫలానా’ అని ముద్రించుకోవడం నిబంధనలకు విరుద్ధం. ఒకవేళ ఎవరైనా ఇలా దుర్వినియోగం చేస్తే, ప్రభుత్వం ఆ అవార్డును వెనక్కి తీసుకునే అధికారం కలిగి ఉంటుంది.
పద్మ అవార్డులు అంటే కేవలం ఒక పతకం కాదు, అది ఆ వ్యక్తి దేశం పట్ల చూపిన అంకితభావానికి నిదర్శనం. నేడు ఈ అవార్డులు సామాన్యుల ముంగిట చేరుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఉండి లోకానికి తెలియని సేవలు చేస్తున్న ‘అన్సంగ్ హీరోస్’ (గుర్తింపు లేని వీరులు) ను వెతికి పట్టుకుని ప్రభుత్వం ఈ పురస్కారాలతో గౌరవిస్తోంది.