Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Happy Birthday To Senior Actress Prabha

అభినయంలో వెలిగిన ప్రభ!

Published Date :October 20, 2021 , 10:36 am
By Prakash
అభినయంలో వెలిగిన ప్రభ!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

(అక్టోబర్ 20న నటి కోటి సూర్య ప్రభ పుట్టినరోజు)
ఆ రోజుల్లో నటి ప్రభ పేరు తెలియనివారు లేరు. తనదైన అభినయంతో అలరిస్తూ సాగారు ప్రభ. మేటి నటుల సరసన నటించారు. వర్ధమాన కథానాయకులతోనూ మురిపించారు. అయితే ఆమె పేరుకు తగ్గట్టుగా ఎందుకనో హీరోయిన్ గా వెలుగులు విరజిమ్మ లేకపోయారనే చెప్పాలి. ఏది ఏమైనా నటిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు ప్రభ. నాట్యంలోనూ ఎంతో ప్రావీణ్యమున్న ప్రభ దేశవిదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు.

ప్రభ పూర్తి పేరు కోటి సూర్య ప్రభ. తెనాలిలో 1958 అక్టోబర్ 20న ప్రభ జన్మించారు. లలిత కళల్లో ప్రావీణ్యమున్న ఇంట్లో పుట్టడం వల్ల ప్రభకు బాల్యంలోనే కన్నవారు నాట్యం నేర్పించారు. కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం వద్ద నాట్యశిక్షణ పొందారు. నాజూకు దేహంతో చూపరులను ఇట్టే ఆకట్టుకొనే ప్రభ తొలుత ‘నీడలేని ఆడది’ చిత్రంలో తెరపై కనిపించారు. “అమ్మాయిలు జాగ్రత్త, అన్నదమ్ముల కథ, రామయ్య తండ్రి, అత్తవారిల్లు, అల్లుడొచ్చాడు” వంటి చిత్రాలలో ద్వితీయ నాయికగా నటించారు. అక్కినేని ‘మహాకవి క్షేత్రయ్య’లో క్షేత్రయ్య మరదలు రుక్ష్మిణిగా నటించారు. యన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన పౌరాణిక చిత్రం ‘దానవీరశూర కర్ణ’లో ఏకంగా రారాజు సుయోధనుని భార్య భానుమతి పాత్రలో నటించారు. అందులో “చిత్రం భళారే విచిత్రం…” అంటూ సాగే గీతంలో యన్టీఆర్ సరసన ప్రభ నటించారు. ఆ చిత్ర ఘనవిజయంతో ప్రభ పేరు మారుమోగిపోయింది. అప్పటి దాకా సైడ్ హీరోయిన్ గా సాగిన ప్రభ కొన్ని చిత్రాలలో మెయిన్ హీరోయిన్ గానూ నటించారు. “దేవతలారా దీవించండి, జగన్మోహిని, ఆమెకథ, ఇంటింటి రామాయణం, ఇదెక్కడి న్యాయం, కోరికలే గుర్రాలయితే, పార్వతీ పరమేశ్వరులు, సంధ్యారాగం, నేను-మా ఆవిడ, సంతోషీమాత వ్రత మహాత్మ్యం, మనిషికో చరిత్ర, శ్రీవినాయక విజయం” వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందిన ‘ఇదెక్కడి న్యాయం’లో హరితకథా భాగవతారిణిగా ప్రభ అభినయం ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ప్రభపై చిత్రీకరించిన “వినుడీ జనులారా…” సాంగ్ లో ఆమె నటన జనాన్ని మురిపించింది.

Also Read

  • Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
  • Music Directors Flops : వరుస ఫ్లాపుల్లో అగ్ర సంగీత దర్శకులు.. క్యాచీ ట్యూన్స్‌ కరువయ్యాయా?
  • Tollywood February Box Office Report : ఫిబ్రవరిలో పరాజయాల పరంపర.. ఆదుకోని శ్రీ విష్ణు..
  • Tollywood : 2026 టాలీవుడ్ జనవరి సినిమాల రిజల్ట్స్.. ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే?
Add as a preferred
source on google

యన్.టి.ఆర్, దాసరి, రాఘవేంద్రరావు వంటి దర్శకులు ప్రభను ఎంతగానో ప్రోత్సహించారు. యన్టీఆర్ ‘శ్రీమద్విరాట పర్వము’లో సత్యభామగా నటించారామె. అలాగే ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’లో వేమన ఎపిసోడ్ లో విశ్వదగానూ కనిపించారు. ఆ పై ‘సింహం నవ్వింది’లో యన్టీఆర్ సరసన ప్రత్యేక పాత్రలో నటించారు. ఇక ఏయన్నార్ సరసన ‘మహాత్ముడు’లో కీలక పాత్ర పోషించారామె. కృష్ణతో ‘కొల్లేటి కాపురం’లో నాయికగా నటించారు. తరువాతి రోజుల్లోనూ తన దరికి చేరిన పాత్రల్లో అలరించారు ప్రభ. ఆ మధ్య వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’లోనూ ప్రభ నటించారు. ఇప్పటికీ ఉత్సాహంగా నవతరం ప్రేక్షకులతో కలసి నటించాలని చూస్తున్నారామె.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Happy Birthday Prabha
  • HBD Prabha
  • Prabha
  • Prabha Birthday
  • Surya Koti Prabha

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్

  • S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..

  • LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!

  • Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!

  • PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions