Bheems Ceciroleo : టాలీవుడ్ లో దూసుకెళ్తున్న భీమ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే దేవీశ్రీ తమన్ ఈ ఇద్దరితోపాటు రెండేళ్లుగా అనిరుధ్ పేరు కూడా మోత మోగిస్తోంది. అయితే రీసెంట్గా ఓ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ హవా సాగిస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కు తనేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. చిన్న సినిమా అయినా పాటతో పెద్ద హిట్ చేస్తున్నాడు భీమ్స్. వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలోని గోదారి గట్టుమీద రామచిలకే’ సాంగ్‌తో భీమ్స్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. తక్కువ టైంలో 50 మిలియన్ వ్యూవ్స్ రావడంతోపాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట రీల్సే.
Also Read : Rewind 2024 : విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి హిట్ కొట్టిన సినిమాలు ఇవే
Also Read
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
వెంకటేశ్, అనిల్ రావిపూడి, దిల్‌రాజు కాంబోలో రూపొందుతున్న మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ కలయికలో వచ్చిన గత రెండు సినిమాలు ఎఫ్2. ఎఫ్3కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. మూడో సినిమకు సంగీత దర్శకుడిగా భీమ్స్‌ను తీసుకుంటే మ్యూజికల్‌తో హైప్ తీసుకొచ్చాడు. గోదారి గట్టు మీద రామ చిలకను మర్చిపోక ముందే, వెంకటేశ్‌తో ‘బ్లాక్‌బస్టర్ సంక్రాంతి’ పాటను పాడించి సినిమాకు ఊపు తీసుకొచ్చాడు. భీమ్స్ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నా 12 ఏళ్ల క్రితమే 2012లో అల్లరి నరేశ్ ‘నువ్వా నేనా’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే వరుస ఫ్లాపులతో గుర్తింపు దక్కలేదు. ధమాకా క్రేజ్ తీసుకురాగా మ్యాడ్తో మరో హిట్ అందుకున్నాడు. దీంతో సీనియర్ హీరో వెంకటేశ్ సినిమాకు వర్క్ చేసే ఛాన్స్ కొట్టేశాడు భీమ్స్. మ్యాడ్‌లో కాలేజీ సాంగ్ స్టూడెంట్స్‌లో జోష్ నింపితే, దీనికి ధీటుగా స్వాతిరెడ్డి సాంగ్‌తో మ్యాడ్ స్క్వేర్‌కు హైప్ తీసుకొచ్చాడు. దేవీశ్రీ, తమన్‌లా భీమ్స్ త్వరలో స్టార్స్ సినిమాలకు రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ వుంది. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’కు అడవి శేషు ‘డెకాయిట్’కు మ్యూజిక్ ఇస్తున్నాడు భీమ్స్.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
-
YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!